Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజమ్మ కంటతడి, అసలేమైంది?

రోజమ్మ కంటతడి, అసలేమైంది?
, సోమవారం, 18 జనవరి 2021 (18:26 IST)
సరిలేరు నాకెవ్వరు అనే విధంగా ఉంటారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. సినిమాలో రోజా మహానటి. రాజకీయాల్లో అయితే ఫైర్ బ్రాండ్. అయితే అలాంటి ఫైర్ బ్రాండ్ ఉన్నట్లుండి కంటతడి పెట్టారు. తనకు విలువ లేదంటూ ఆవేదన చెందారు.
 
ఎమ్మెల్యేలకు ఇచ్చే విలువ కూడా ఇవ్వడం లేదంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. వాదనలు విన్న అనంతరం వాక్ అవుట్ చేశారు. తిరుపతిలో ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి వచ్చారు రోజా. శాసనసభ్యులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్ళారు.
 
ముందుగా రోజా ఏడు నిమిషాల పాటు ప్రసంగించారు. అందులో ఐదు నిమిషాల పాటు ఏడుస్తూనే తన ఆవేదనను వెళ్లగక్కారట రోజా. తనకు ఎక్కడా ప్రోటోకాల్ ఇవ్వడం లేదన్నారట. టిటిడిలో కూడా తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారట. ఎన్ని కమిటీలు వచ్చినా.. ఎంతమందికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదంటూ బోరున విలపించారట రోజా. ఇదంతా ప్రివిలేజ్ కమిటీ ముందు జరిగితే హడావిడిగా రోజా వెళ్ళిపోతూ కంటతడిపెట్టారు. 
 
ఐతే మీడియా ముందు అదేమీ లేదంటూ చెప్పారు. ఎర్రబారిన కళ్ళతో సరిగ్గా మాట్లాడలేని పరిస్థితుల్లో రోజా కనిపించారు. ఒక సీనియర్ ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా అని ప్రశ్నించారట. రోజా కన్నీంటి పర్యంతమవుతుండటంతో ప్రివిలేజ్ కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయారట. దీనిపై కలెక్టర్‌తో కమిటీ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడడంతో పాటు మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారట. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ISWOTY: టోక్యో ఒలింపిక్ క్రీడలపై జెయింట్ కిల్లర్ సోనమ్ మాలిక్ ఆశలు