మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్.కే.) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వాక్సిన్ తొలి డోసు చేయించుకున్న విషయం విదితమే.
ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే ఆర్.కే. అదేరోజు అర్థరాత్రి నుంచి 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ తన నివాసంలోనే చికిత్స పొందుతోన్నారు.
మంగళవారం సాయంత్రానికి తాను తిరిగి కోలుకుంటానని,జ్వరం తగ్గగానే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు ఎమ్మెల్యే ఆర్.కే.తెలిపారు.