Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ వ్యాక్సిన్ .. వాస్తవాలు

Advertiesment
కోవిడ్ వ్యాక్సిన్ .. వాస్తవాలు
, శుక్రవారం, 18 డిశెంబరు 2020 (05:19 IST)
ప్రపంచమంతా ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ల కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మనదేశంలోనూ డిసెంబర్ చివరి వారం నుంచే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది.

రాష్ట్రాలను కూడా ఈ మేరకు అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ పై తరచుగా అడిగే ప్రశ్నలు, వాటికి సమాధానాలను ఢిల్లీకి చెందిన పెడియాట్రిక్ వైద్యులు రూపొందించారు. అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 
 
1) కరోనా వ్యాక్సిన్ ఎప్పటిలోపు అందుబాటులోకి వస్తుంది?
ప్రభుత్వం బహుశా జనవరి నాటికి అందుబాటులోకి తీసుకురావచ్చు. ప్రైవేట్ మార్కెట్లో మార్చి నుంచి అందుబాటులో ఉండొచ్చు.
 
2) మనం అందరం ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా?
అవును, అందరూ తీసుకోవాలి.
 
3) మొదట వ్యాక్సిన్ ఎవరు పొందుతారు?
దీనికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. మొదటి ఫ్రంట్‌లైన్ కార్మికులకు వ్యాక్సిన్ ఇస్తారు. ఇందులో పారామెడికల్ సిబ్బంది, పౌర సేవకులు, పోలీసులు, సైన్యం, రాజకీయ నాయకులు, వారి బంధువులు ఉంటారు. ఆ తర్వాత 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, డయాబెటిస్, హైపర్ టెన్షన్, ట్రాన్స్ ప్లాంట్, కీమోథెపరీ పేషెంట్లు ఉంటారు. వారి తర్వాత ఆరోగ్యంగా ఉన్న పెద్దవాళ్లు, యువత, పిల్లలు మరియు చివరగా చిన్నపిల్లలు ఉంటారు. 
 
4) వ్యాక్సిన్ ఇలా ఇవ్వబడుతుంది?
ప్రభుత్వ మరియు ప్రైవేట్ కేంద్రాల ద్వారా వైద్యులు, దంత వైద్యులు, నర్సులు మరియు శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బంది ద్వారా వ్యాక్సిన్ ఇస్తారు. 
 
5) సిఫార్సు చేసిన మోతాదు మరియు షెడ్యూల్ ఏమిటి?
వ్యాక్సిన్ మోతాదును బట్టి రెండు డోసులుగా ఇస్తారు. మోతాదును బట్టి కాలవ్యవధి 21 రోజులు లేదా 28 రోజులు ఉండొచ్చు. 
 
6) ఒకవేళ నేను ఒక మోతాదు మాత్రమే తీసుకుంటే?
ఒక మోతాదు మాత్రమే తీసుకుంటే 60- 80శాతం పాక్షిక రక్షణ మాత్రమే ఇస్తుంది. దీర్ఘకాలం రక్షణ ఉండదు. పూర్తిస్థాయిలో రక్షణ ఉండాలంటే సిఫార్సు చేసిన మేరకు రెండు డోసులు తీసుకోవాలి.
 
7) నేను రెండవ మోతాదు తీసుకోవడం మర్చిపోతే? నేను మళ్ళీ మొదటిదాన్ని తీసుకోవాలా?
రెండో మోతాదును వీలైనంత త్వరగా తీసుకోండి. అంతేకానీ మళ్లీ మొదటి మోతాదును తీసుకోవాల్సిన అవసరం లేదు. 
 
8) రెండు మోతాదులు ఒకేలా ఉంటాయా?
చాలా వ్యాక్సిన్లలో రెండు సార్లు ఇచ్చే మోతాదులు ఒకేలా ఉంటాయి. అయితే రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ రెండు డోసులు వేర్వేరు వెక్టర్ వైరస్లుగా ఉంటాయి. కాబట్టి డోస్1, డోస్2 అని గుర్తించుకోవాలి. ఆక్స్ఫర్డ్- అస్ట్రా జెనికా వ్యాక్సిన్ కూడా మొదటి మోతాదుతో సగం బయటకు రావచ్చు. 
 
9) మీకు కరోనా ఉన్నప్పటికీ మీరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? కరోనా నుంచి కోలుకున్న ఎన్ని రోజుల తరువాత?
అవును. అది ప్రాధాన్యత జాబితాలో చివరిది. మీకంటే ఎక్కువ అవసరం ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మీలో యాంటీబాడీలు అభివృద్ధి చెందకపోతేనే అది అవసరం కావచ్చు. 
 
10) కోవిడ్ చికిత్స తర్వాత ప్లాస్మాను అందుకున్న వ్యక్తికి దీన్ని వేయవచ్చా?
కోవిడ్ నుంచి కోలుకున్న డోనర్ ప్లాస్మాను ఇచ్చే సమయానికి అతనిలో యాండీబాడీలు డెవలప్ అయి ఉంటాయి. కాబట్టి కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ప్రారంభ దశలోనే టీకా అవసరం ఉండకపోవచ్చు.
 
11) గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు టీకా తీసుకోవచ్చా?
ఇప్పటి వరకు గర్భిణీలపై టీకాను ఏ కంపెనీ పరీక్షించలేదు. గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇవ్వడం చేయవద్దని సీడీసీ కూడా సూచించింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన రాకపోయినా ఈ రెండు నెలల్లో గర్భం దాల్చవద్దని మహిళలకు యుకె అధికారులు సలహా ఇచ్చారు. ఒకవేళ అనుకోకుండా వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నారు. 
 
12) డయాబెటిక్ పేషెంట్లు వ్యా్క్సిన్ తీసుకోవచ్చా?
అవును తీసుకోవచ్చు. కోవిడ్ వైరస్ వచ్చే అవకాశాలున్న లక్షణాల్లో డయాబెటిక్ అనేది కూడా ఒకటి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లందరూ ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ వేయించుకోవాలి.
 
13) వ్యాక్సిన్ల ఎంపికలో ఆప్షన్ ఇచ్చి ఎంచుకోవాల్సి వస్తే నేను ఏది తీసుకోవాలి?
అన్ని వ్యాక్సిన్లు సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే స్థానికంగా ఉండే కారణాలు మాత్రం వేరుగా ఉండవచ్చు. కాబట్టి మీకు అందుబాటులో ఏవి ఉంటే వాటినే ఎంచుకోండి. ముఖ్యంగా మనదేశంలో తయారైన వ్యాక్సిన్లు ఇతర దేశాల వ్యాక్సిన్ల కంటే మన జనాభాకి అనువుగా ఉంటాయి. ఎందుకంటే మనవి చౌకగా లభించడంతోపాటు 2-8 డిగ్రీ సెల్సియస్ వద్ద నిల్వ ఉంచవచ్చు. అదే ఎంఆర్ఎన్ఎ టీకాలకు -70 (ఫైజర్) మరియు -20 (మోడెర్నా)లను వేసవిలో నిల్వ ఉంచడం కష్టం.
 
14) టీకా తీసుకున్న ఎన్ని రోజుల తర్వాత నేను రక్షణ పొందే అవకాశాలు ఉంటాయి?
రెండవ మోతాదు తీసుకున్న 10 రోజుల తర్వాత నుంచి పూర్తిస్థాయిలో రక్షణ పొందే అవకాశం ఉంటుంది. తీవ్రత 100శాతం ఉండి ఆస్పత్రిలో చేరకుండా దీని సమర్థత 70-90% వరకు ఉండి మరణాల రేటును తగ్గించే అవకాశం ఉంది.  
 
15) టీకా ఎంతకాలం రోగనిరోధక శక్తిని అందిస్తుంది?
ఇది కొత్త వైరస్, కొత్త టెక్నాలజీతో కూడిన టీకా. కాబట్టి ఎంతకాలం రక్షణ ఇస్తుందన్నది తెలియదు. వ్యా్క్సిన్ పొందిన జనాభా మరియు వారిలో యాంటీబాడీస్ అభివృద్ధి కొన్నేళ్ల తర్వాత మనకు ఈ విషయాలపై అవగాహన వచ్చే అవకాశం ఉంది. 
 
16)  ఏ వయస్సు పిల్లలకు టీకాలు వేయవచ్చు? పెద్దలకు కూడా సమానంగా డోసు వేయాలా? లేక తక్కువ మోతాదులో ఇవ్వాలా?
ఇప్పటివరకు చేసిన ట్రయల్స్ అన్నీ 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే. 12 ఏళ్లకు పైబడిన పిల్లలపై ఇప్పుడే ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. చిన్న పిల్లలు మరియు శిశువులపై ట్రయల్స్ పూర్తయిన తర్వాత మాత్రమే మోతాదు ఎంత అనేది నిర్ణయించబడుతుంది.
 
17) టీకాను రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు ఇవ్వవచ్చా?
ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ మరియు క్రియారహితం చేసిన వ్యాక్సిన్లు సురక్షితం. ఆక్స్ఫర్డ్- అస్ట్రా జెనికా, స్పుత్నిక్-వి అడెనోవైరస్ వెక్టర్ టీకాలు ప్రత్యక్ష వ్యాక్సిన్లు మరియు దాని ప్రతిరూపాలైన వైరల్ వెక్టర్ వ్యాక్సిన్లను దూరంగా ఉంచాలి.
 
18) వ్యాక్సిన్ వల్ల ఉండబోయే దుష్ప్రభావాలు ఏమిటి?
ఇప్పటి వరకు వ్యాక్సిన్ పరీక్షించిన జనాభాలో ఎక్కువ శాతం తేలికపాటి లక్షణాలైన జ్వరం మరియు అలసట వంటి లక్షణాలు ఉన్నవారే. టీకాకు సంబంధించి ట్రాన్స్వర్స్ మైలిటిస్ మరియు ఫేషియల్ పాల్సీ కి సంబంధించిన ఎలాంటి నివేదికలు లేవు. సాధారణంగా అన్ని వ్యాక్సిన్లు సురక్షితమే. అయినప్పటికీ ఈ టీకాలు రికార్డ్ సమయంలో పరీక్షించినిప్పటికీ విధివిధానాల విషయంలో మాత్రం రాజీపడలేదు.  
 
19) నాకు గుడ్డు అంటే అలెర్జీ. నేను టీకా తీసుకోవచ్చా?
టీకాల ఉత్పత్తికి గుడ్డులోని కణతంతువులు ఉపయోగించలేదు. కాబట్టి మీకు గుడ్డు అంటే అలెర్జీ అయినప్పటికీ వ్యాక్సిన్ ను సురక్షితంగా తీసుకోవచ్చు.
 
20) టీకాలో పంది లేదా కోతి ఉత్పత్తులు ఉన్నాయని విన్నాను? నేను పూర్తి శాఖాహారిని.
ఈ రోజుల్లో తయారుచేసిన ఈ కొత్త టీకాలు అటువంటి ఉత్పత్తులను కలిగి లేవు. కాబట్టి శాఖాహారులు కూడా టీకా వేసుకోవచ్చు.
 
21) ఇంతకుముందు టీకాలు ఆటిజంతో ముడిపడి ఉన్నాయి. మరి వీటి గురించి ఏమిటి?
1985 లో MMR ను ఆటిజంతో పేపర్ ఉండేది. కానీ ఆ తర్వాత లక్షలాది మంది పిల్లల మీద జరిపిన పరిశీలనలో వ్యాక్సిన్లు మరియు ఆటిజం మధ్య ఎలాంటి సబంధం లేదని గుర్తించారు. అన్ని టీకాలు పూర్తి సురక్షితమని తక్కువ, తాత్కాలిక దుష్ప్రభావాలు మాత్రమే ఉంటాయి.
 
22) ఆల్కహాల్ మరియు కోవిడ్ వ్యాక్సిన్ మధ్య పరస్పర చర్యలు ఏమిటి?
అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల టీకాలు వేసినా రోగనిరోధక ప్రతిస్పందనలను తగ్గిస్తుంది. అందుకే ఎక్కువ మద్యం తాగుతాగే రష్యన్లకు అక్కడి ప్రభుత్వం మొదటి డోసుకు రెండు వారాల ముందు, రెండో మోతాదు తర్వాత 6వారాలు మద్యపానాన్ని మానేయాలని సలహా ఇచ్చింది. అయితే అప్పుడప్పుడు గ్లాస్ వైన్ లేదా బీర్ తీసుకోవడం వల్ల రోగినిరోధక శక్తిపై ఏమాత్రం ప్రభావం చూపదని తెలిపారు.
 
23) త్వరలో వైరస్ పరివర్తన చెందుతుందని తెలుస్తోంది. అప్పుడు మాకు మరొక టీకా అవసరం. మనం వేచి ఉండకూడదా?
ఇప్పటివరకు కోవిడ్ వైరస్ ఫ్లూ వైరస్ లాగా పరివర్తన చెందే ధోరణిని చూపించలేదు. అంతేకాకుండా, ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న టీకాలు దీన్ని పరిగణనలోకి తీసుకున్నాయి. కాబట్టి ఇవి వైరస్ పరివర్తన చెందినా పనిచేస్తాయి.
 
24) నేను టీకా తీసుకోకూడదనుకుంటే ఎలా? ఒకవేళ అది తప్పనిసరి తీసుకోవాలా?
మెజారిటీ దేశాలలో టీకా తీసుకోవడం తప్పనిసరి కాదు. తీసుకోవాలా వద్దా అన్నది మీరు ఎంచుకోవాలి
ఈ కొత్త వైరస్ కి నిర్దిష్ట చికిత్స మరియు టీకా లేని పరిస్థితుల్లో దాని అవసరం ఉన్నవారు చాలా మంది ఉంటారు. కాబట్టి సప్లయ్ డిమాండ్ మధ్య చాలా అంతరం ఉంటుంది. మీరు తీసుకోకపోవడం వల్ల ఇతరులకు ఉపయోగకరం అవ్వొచ్చు. 
 
25) కోమార్బిడిటీ లక్షణాల కారణంతోపాటు సీనియర్ సిటిజన్‌గా ఉండటం వల్ల నేను ప్రాధాన్యతా జాబితా విభాగంలోకి వస్తే టీకా కొరకు ఎలా సంప్రదించాలి?
త్వరలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 'కోవిన్' అనే  వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తుంది. అందులో మీకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయండి.
 
26) 'కోవిన్' అంటే ఏమిటి?
కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ (కొవిన్‌) అనేది ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ ఎండ్ టు ఎండ్ టీకా పంపిణీ మరియు నిర్వహణ వ్యవస్థ. ఇందులో లబ్ధిదారుల పేర్లు నమోదు, ప్రామాణీకరణ, ధ్రువీకరణ పత్రాలు, షెషన్ కేటాయింపు, ఎఈఎఫ్ఐ, సర్టిఫికెట్ జనరేషన్, డ్యాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర విషయాలన్ని ఉంటాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఆ సమాచారాన్ని లబ్ధిదారునికి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తుంది. టీకా కేంద్రంలో ఐదుగురు వ్యక్తులు ఉంటారు. రోజుకు గరిష్టంగా 100 టీకాలు మాత్రమే ఇస్తారు. టీకా వేసుకున్న వ్యక్తి కనీసం 30 నిమిషాలపాటు వేచి ఉండాలి. ఆ తర్వాతే బయటికి వెళ్లాలి.
 
27) సమీప భవిష్యత్తులో అందుబాటులో ఉండే వివిధ రకాలైన కరోనా వ్యాక్సిన్లు
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి కోవిషీల్డ్ (ఆక్స్ఫర్డ్- అస్ట్రా జెనికా), స్పుత్నిక్-వి అనే రష్యన్ వ్యాక్సిన్ ను ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తయారు చేస్తోంది. కోవాక్సిన్ ను భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ తయారు చేస్తోంది. పైజర్ మరియు మోడెర్నా వ్యాక్సిన్లను అమెరికా తయారు చేస్తోంది. ఇవేకాకుండా బయోలాజిక్ ఈ, క్యాడిలా హెల్త్ కేర్ అండ్ జెనోవా అనే భారత కంపెనీలు కూడా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో అడ్వాన్స్ స్టేజిలో ఉన్నాయి. 
 
28) టీకాలు వేసిన తర్వాత నేను మాస్కు లేకుండా తిరుగవచ్చా?
లేదు. అలా తిరగకూడదు. అత్యధికమంది ప్రజలకు వైరస్ సోకడమో లేదా వ్యాక్సిన్ అందరూ వేయించుకోవడం జరిగిన తర్వాతే ఇది సాధ్యం కావచ్చు. అంటే అప్పుడు మాత్రమే హర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టు లెక్క.
 
29) సమీప భవిష్యత్తులో ఇంకా కొత్తగా మంచి కోవిడ్ టీకాలు ఏమైనా ఆశించవచ్చా?
2020 డిసెంబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 250కి పైగా టీకాలు పరిశోధనా దశలో ఉన్నాయి. పెద్దఎత్తున రీసెర్చ్ వర్క్ జరుగుతోంది. పంపిణీకి కొత్త పద్దతులు కూడా అభివృద్ధి చేస్తున్నారు. ముక్కులో స్ప్రే చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే బహుశా అదే ఎక్కువ ఆశాజనకంగా ఉంటుంది. ఇది వైరస్ ముక్కు ద్వారా వ్యాపించకుండా అడ్డుకుంటుంది. అయితే ఇది ఇంకా ప్రయోగ దశల్లోనే ఉంది. ఇది అందుబాటులోకి రావడానికి ఇంకా చాల సమయం పడుతుంది. ఒకవేళ వచ్చిన తర్వాత మాత్రం ఇదే మార్కెట్ లో ఎక్కువ కాలం ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా సౌకర్యవంతం మరియు పొదుపుగా ఉంటుంది.

కోవిడ్ -19 ఇప్పటికీ ఒక కొత్త వ్యాధి లాంటిదే. మనం ఇంకా ఆ వైరస్ గురించిన విషయాలను తెలుసుకుంటూనే ఉన్నాము. పైన చెప్పిన విషయాలు, వాస్తవాలు అన్ని డిసెంబర్ 14, 2020 నాటివి. మీరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే ముందు మరోసారి వీటిని పరిశీలించుకోండి. ఏ వ్యాక్సిన్ కూడా 100శాతం రక్షణ ఇస్తుందని చెప్పబడలేదు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి వైరస్ ను వృద్ధి చేయలేరు. కానీ ఇతరులకు వ్యాప్తి చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కును ధరించడం కొనసాగించండి. భౌతిక దూరం పాటించండి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవడాన్ని కొనసాగించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో కరోనా కేసులు.. కొత్త రికార్డు.. 3,700 మంది మృతి