Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామోజీరావుకి వయస్సు పెరిగింది గానీ... బుద్ది మాత్రం పెరగలేదు!

Advertiesment
రామోజీరావుకి వయస్సు పెరిగింది గానీ... బుద్ది మాత్రం పెరగలేదు!
విజయవాడ , శుక్రవారం, 20 ఆగస్టు 2021 (12:41 IST)
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈనాడు అధిప‌తి రామోజీరావుపై నిప్పులు చెరిగారు. తాడేప‌ల్లిలో శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తాడేపల్లి లోని ఒక స్కూల్‌కి సంబంధించి ఈనాడులో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని వివ‌ర‌ణ ఇచ్చారు.

చాలా దారుణంగా, నీచంగా ఈనాడు వారు ప్రవరిస్తున్నారు. నాడు నేడు ద్వారా సీఎం జగన్ విద్యా శాఖలో సమూల మార్పులు తీసుకువచ్చారు. ఈనాడులో వచ్చిన స్కూల్‌కి సంబందించిన దుస్తితికి చంద్రబాబే కారణం. ఒకవైపు పిల్లలు ఎంతో ఆనందంతో స్కూల్స్‌కి వస్తున్నారు..

నాడు నేడు మొదటి విడత పూర్తి చేసిన తరుణంలో ఇలాంటి వార్త రాయడం దారుణం అని ఎమ్మెల్యే ఆర్.కె. ఆరోపించారు. నాడు నేడు రెండో విడతకు కూడా సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. కుప్పంలో చంద్రబాబు చదువుకున్న స్కూల్ కూడా దయనీయ స్థితిలో ఉంది. దాన్ని కూడా సిఎం అభివృద్ధి చేశారు. రైతులకు సంబంధించి మీటర్ల ఏర్పాటు విషయంలో మరో వార్తను ఇటీవల రాశారు....ఇది కూడా పూర్తిగా అవాస్తవం.

రైతుల సంక్షేమం కోసమే రైతుల విద్యుత్తు కు మీటర్ల ఏర్పాటు ప్రక్రియ మొద‌లుపెట్టాం. దీనివల్ల విద్యుత్ ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తారు. రైతుల అభ్యున్నతి కోసం సీఎం జగన్ పని చేస్తున్నారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో లక్షన్నర కోట్ల రూపాయల అప్పులు చేసి దోచుకున్నారు. వాటికి సంబంధించి సమాధానం లేదు. సీఎం జగన్ ప్రజా సంక్షేమం కోసం అప్పులు చేస్తే తప్పుడు వార్తలు రాస్తున్నార‌ని విమ‌ర్శించారు.

రామోజీరావు ప్రక్కన కూర్చుని చంద్రబాబు వార్తలు రాయిస్తున్నార‌నే సందేహాలు కలుగుతున్నాయి. తప్పుడు వార్తలు రాస్తే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. పరిపాలనలో లోపాలు ఉంటే సూచనలు, సలహాలు ఇచ్చి ప్రజలు మన్ననలు పొందండి. అంతేగానీ, తప్పుడు రాతలు రాయమాకండి. చంద్రబాబు తన రాజకీయ లబ్ది కోసం కులమతాలతో పాటు చివరకు దేవుడ్ని కోసం వాడుకున్నాడ‌ని ఎద్దేవా చేశారు.

రామోజీరావు! నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను.. తప్పుడు వార్తలు రాయవద్దు... ప్రజలు చాలా చైతన్య వంతులు అయ్యార‌ని రామోజీరావు తెలుసుకోవాలి... పాత కాలపు పోకడలకు రామోజీరావు స్వస్తి చెప్పాలి... అభివృద్ది గురించి రామోజీ రాయకపోయినా పర్వాలేదు గానీ, అవాస్తవ కథనాలు మాత్రం రాయోధ్దు.... రామోజీరావు కి వయస్సు పెరిగింది గానీ, బుద్ది మాత్రం పెరగలేదు.. వయస్సుతో పాటు అన్ని పెరుగుతాయి రామోజీరావు గారు...రామోజీరావుకి సిగ్గు, శరం ఏమీలేవు... ఇవి ఉంటే తప్పుడు వార్త‌లు రాయరు... ఇంకోవైపు చంద్రబాబు కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులతో నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, యెల్లో మీడియాను గమనిస్తున్నారు... అని ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణా రెడ్డి విమ‌ర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెకె రాజు ఇంటికి వెళ్ళి అభినందించిన డిప్యూటీ సీఎం ధ‌ర్మాన