Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైనారిటీల సంక్షేమ సలహాదారునిగా షేక్ మెహ్మద్ జియాఉద్దీన్

మైనారిటీల సంక్షేమ సలహాదారునిగా  షేక్ మెహ్మద్ జియాఉద్దీన్
విజ‌య‌వాడ‌ , సోమవారం, 10 జనవరి 2022 (16:02 IST)
మైనారిటీల సంక్షేమ సలహాదారునిగా షేక్ మెహ్మద్ జియాఉద్దీన్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం మూడో బ్లాక్ లోని సమావేశమందిరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా ఆధ్వ‌ర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మైనారిటీ వర్గానికి చెందిన తనకు ఇటువంటి ఉన్నత పదవిని కట్టబెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 
 
 
తనపై ఎంతో నమ్మకంతో ఇటువంటి గురుతర బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా మైనారీటీల సంక్షేమానికి, సమగ్ర అభివృద్దికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. మైనారిటీల సంక్షేమ శాఖ అధికారులు అందరినీ సమన్వయ పర్చుకుంటూ వారి సహాయ సహకారాలతో మైనారిటీల సంక్షేమానికై అమలు పరుస్తున్ననవరత్నాల పథకాలను క్షేత్ర స్థాయిలో మరింత అమలు పర్చి ప్రభుత్వానికి మరింత పేరు వచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా మాట్లాడుతూ, మైనారీల సమస్యలపై మంచి అవగాహన ఉన్న షేక్ మెహ్మద్ జియాఉద్దీన్ను మైనారిటీల సంక్షేమ సలహాదారునిగా ప్రభుత్వం నియమించడం ఎంతో అభినందనీయమన్నారు. 
 
 
గతంలో రెండు సార్లు శాసన సభ్యునిగా, మైనారిటీస్ కమిషన్ చైర్మన్ గా గురుతర బాధ్యతలు నిర్వహించి మైనారిటీల సంక్షేమానికి ఎంతో పాటుపడ్డ జియాఉద్దీన్ ని మైనారిటీల సంక్షేమ సలహాదారునిగా ప్రభుత్వం నియమించడంతో మైనారిటీల సంక్షేమానికి నూతన శకం ప్రారంభం అయినట్లు ఉప ముఖ్యమంత్రి అభివర్ణించారు. తమ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట వేసిందనడానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.


మైనారిటీల సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ గంథం చంద్రుడు మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమ సలహాదారునిగా షేక్ మెహ్మద్ జియాఉద్దీన్ ను ప్రభుత్వం నియమించడం ఎంతో అభినందనీయమన్నారు. వారి సహాయ, సహకారాలతో మైనారిటీల సంక్షేమానికి మరిన్ని మెరుగైన పథకాలను రూపొందించి అమలు పర్చేందుకు కృషి చేస్తామన్నారు. మైనార్టీస్ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో పాటు పలువురు మైనార్టీస్ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని మైనారిటీల సంక్షేమ సలహాదారునిగా బాధ్యతలు చేపట్టిన షేక్ మెహ్మద్ జియాఉద్దీన్ ను ఘనంగా సత్కరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు : కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి