Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్సార్ పెళ్లి కానుక ఏదీ? బిజెపి మైనార్టీ మోర్చావిన‌తి

Advertiesment
వైఎస్సార్ పెళ్లి కానుక ఏదీ? బిజెపి మైనార్టీ మోర్చావిన‌తి
విజయవాడ , సోమవారం, 23 ఆగస్టు 2021 (15:41 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన వైఎస్సార్ పెళ్లి కానుక ఏద‌ని ముస్లిం మైనారిటీలు ప్ర‌శ్నిస్తున్నారు. ముస్లిం చెల్లెమ్మల‌ వివాహానికి గత టిడిపి ప్రభుత్వం ఇస్తున్న 50 వేలు రెట్టింపు చేసి, లక్ష ఆర్ధిక సహాయం అందిస్తామని సీఎం జ‌గ‌న్ హామీ ఇచ్చినప్పటికీ మైనార్టీ పెళ్లి కానుక పథకం అమలు చేయకపోవ‌డం విచారకరమని  బిజెపి మైనార్టీ మోర్చా పేర్కొంది.

ఈ మేరకు తూర్పుగోదావ‌రి జిల్లా కలెక్టర్ ని ఉద్దేశించిన వినతిపత్రాన్నిసోమవారం సబ్ కలెక్టర్ కి బిజెపి నాయకులు అందజేశారు. రాజమండ్రి జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు జెడ్ ఏ బేగ్, రూరల్ మండల విభాగం అధ్యక్షుడు ఎస్ కె సత్తార్ సోయబ్ , రాజమండ్రి జిల్లా విభాగం ఉపాధ్యక్షులు ఎస్ కె తానీషా,  ఎండి కరీముల్లా షా , అబ్దుల్ సత్తార్, ఎండి కరీముల్లా, రూరల్ మండల బిజెపి అధ్యక్షులు యానాపు యేసు, కొవ్వూరు టౌన్ ఉపాధ్యక్షుడు కొండపల్లి రత్నసాయి తదితరులు స‌బ్ కలెక్ట‌ర్ ని క‌లిశారు.

జగన్ సర్కార్ వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా, నేటికి పథకాలు అమలు అనేది జరగడం లేదని,  పైగా  లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే అన్ లైన్ పోర్టల్ ను కూడా మూసివేశారని పేర్కొన్నారు.  2019 సెప్టెంబర్ 19న పధకం  పేరు మార్చిరెట్టింపు ఇస్తామని చెప్పార‌ని, ఈ మేర‌కు జీఓ.యం.యస్.నం. 105 ను2020లో జారీ చేశారని గుర్తు చేశారు. అయినా ఏపి ప్రభుత్తం విడుదల చేసిన జీవో కూడా అమలుకు నోచుకోలేదని పేర్కొంటూ, తక్షణం వైఎస్సార్ పెళ్లి కానుక పధకాన్ని ఏప్రిల్ 2020 నుంచి అమలు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఆన్ లైన్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పించి, వెంటనే ఈ పధకాన్ని అమలులోకి తీసుకొని రావాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిటిడి అగ‌ర బ‌త్తులు రెడీ... సెప్టెంబ‌రులో భ‌క్తుల‌కు స‌ర‌ఫ‌రా