Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజలు అధికారపక్షం వైపే: మంత్రి బుగ్గన

Advertiesment
ప్రజలు అధికారపక్షం వైపే: మంత్రి బుగ్గన
, శనివారం, 21 మార్చి 2020 (15:39 IST)
స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం అప్రజాస్వామ్యం అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఎన్నికల వాయిదాపై ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదించిందా? అని ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనాతో ఎన్నికలను వాయిదా వేస్తే కోడ్‌ను ఎందుకు కొనసాగించారని ప్రశ్నించారు.

కోడ్ కొనసాగితే కరోనా చర్యలపై ప్రభావం పడదా? అని ఈసీని నిలదీశారు. అధికారికంగా ఎక్కడ సమీక్ష నిర్వహించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆరోగ్య శాఖను సంప్రదించారా? రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో ఉందో ఈసీకి తెలుసా? అని బుగ్గన ప్రశ్నించారు. కరోనాపై సీఎం జగన్ ముందస్తు చర్యలకు ఆదేశించారని మంత్రి తెలిపారు.

90శాతం స్థానాలు గెలవాలని మంత్రులకు సీఎం ఆదేశాలు ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు? అంటూ ఎస్ఈసీని మంత్రి బుగ్గన ప్రశ్నించారు. ఎస్ఈసీ ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్‌ను టార్గెట్ చేశారని ఆరోపించారు. కడప జిల్లాలో సీఎం జగన్ అత్యధిక మెజార్టీతో గెలిచారని, ఆ జిల్లాలో టీడీపీకి ఒక స్టాండ్ ఉందా? అని అన్నారు.

స్థానిక ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు అధికారపక్షం వైపే ఉంటారని బుగ్గన పేర్కొన్నారు. ఎస్ఈసీ రాసిన లేఖ రాజకీయ పార్టీ రాసినట్లు ఉందని విమర్శించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి తప్పుడు ప్రచారం చేస్తారా? అని ఎస్ఈసీ తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనతా కర్ఫ్యూకు సహకరించాలి.. సెలెబ్రిటీల మద్దతు