Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అచ్చెన్నాయుడిని బెదిరించిన ఆ ఇద్దరు అరెస్ట్- రూ.80లక్షలతో యాగం చేశారా?

గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు జ్యోతిష్యునికి రూ.80లక్షలు సమర్పించుకున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. గత ఏడాది నవంబరు మాసంలో జ్యోతిష్యుడు కాళిదాసు వర్మ ఆధ్వర్యంలో శ్రీ సౌభాగ

Advertiesment
అచ్చెన్నాయుడిని బెదిరించిన ఆ ఇద్దరు అరెస్ట్- రూ.80లక్షలతో యాగం చేశారా?
, సోమవారం, 15 జనవరి 2018 (15:59 IST)
గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు జ్యోతిష్యునికి రూ.80లక్షలు సమర్పించుకున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. గత ఏడాది నవంబరు మాసంలో జ్యోతిష్యుడు కాళిదాసు వర్మ ఆధ్వర్యంలో శ్రీ సౌభాగ్య విద్యేశ్వరి పంచాయతన యాగాన్ని అచ్చెన్నాయుడు నిర్వహించారని సిక్కోలులో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ యాగాన్ని అచ్చెన్నాయుడు సతీసమేతంగా నిర్వహించారని తెలుస్తోంది. గ్రహస్థితులు బాగాలేవని తెలుసుకున్న మంత్రి.. ఇందుకోసం జ్యోతిష్యుడికి ఏకంగా రూ.80 లక్షలకు పైనే ముట్టజెప్పారన్న ప్రచారం జరుగుతోంది.
 
కానీ పెద్ద మొత్తంలో మంత్రి నుంచి డబ్బులు గుంజాలని పథక రచన చేసిన కాళిదాసు నక్సలైట్ల పేరుతో బెదిరించి, అడ్డంగా బుక్కయ్యాడు. అనుచరుడితో కలిసి మంత్రి ప్రయాణించే మార్గంలో జిలెటిన్ స్టిక్స్ అమర్చి పోలీసులకు చిక్కాడు.

ప్రస్తుతం శర్మతోపాటు అతడి అనుచరుడు కూడా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు. శర్మ అతని అనుచరులు మంత్రి అచ్చెన్నాయుడుకు బెదిరింపు కాల్స్‌ చేశారు. అయితే వీరిని పోలీసులు పక్కా ప్లాన్‌తో అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూంచ్ సెక్టార్లో భారత్ మరో సర్జికల్ స్ట్రైక్స్ : పాకిస్థాన్ రేంజర్లు అరెస్ట్