అవి నన్నే వెతుక్కుంటూ వస్తాయంటున్న మెహరీన్
						
		
						
				
మహానుభావుడు, రాజా దిగ్రేట్ ఇలా వరుస హిట్లతో దూసుకుపోయింది మెహరీన్. ఇక మెహరీన్‌కు తిరుగేలేదు. అగ్రహీరోయిన్ల సరసనకు వెళ్ళిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. అలా మెహరీన్‌కు దశ తిరిగింది. కానీ ఇప్పుడు మెహరీన్ పరిస్థితి చాలా హీనంగా తయారైందంటున్నారు తెలుగు సి
			
		          
	  
	
		
										
								
																	మహానుభావుడు, రాజా దిగ్రేట్ ఇలా వరుస హిట్లతో దూసుకుపోయింది మెహరీన్. ఇక మెహరీన్‌కు తిరుగేలేదు. అగ్రహీరోయిన్ల సరసనకు వెళ్ళిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. అలా మెహరీన్‌కు దశ తిరిగింది. కానీ ఇప్పుడు మెహరీన్ పరిస్థితి చాలా హీనంగా తయారైందంటున్నారు తెలుగు సినీవర్గాలు. జవాన్ సినిమా తరువాత మెహరీన్‌కు అవకాశాలు ఆగిపోయాయి. ఎవరూ మెహరీన్‌ను పెట్టి సినిమా తీసేందుకు ముందుకు రావడంలేదట.
	
 
									
										
								
																	
	 
	వయస్సుతో సంబంధం లేకుండా ఏ వయస్సు వారితోనైనా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మెహరీన్ చెబుతున్నా ఆమెకు మాత్రం అవకాశాలు ఏ మాత్రం రావడం లేదు. ఇప్పుడు ఇంటికే పరిమితమైపోయింది మెహరీన్. చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేకుండా బాధపడుతోందట. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఖాళీగా ఉన్నానని మాత్రం మెహరీన్ అనుకోవడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక షోరూం ప్రారంభోత్సవానికి వెళుతోంది. అలా బిజీగా గడుపుతోంది. అవకాశాలు దానికదే వస్తాయి..మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పనిలేదంటూ ధీమాగా ఉందంట మెహరీన్.