Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనకాపల్లి జిల్లాలో అర్థరాత్రి స్వల్ప భూకంప ప్రకంపనలు

Advertiesment
earthquake
అనకాపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి స్వల్ప భూకంప ప్రకంపనలు సంభవించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. రాంబిల్లి మండలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైందని అధికారులు ధృవీకరించారు.
 
ఈ ప్రకంపనలు సుమారుగా అర్ధరాత్రి 12:05 గంటలకు సంభవించాయని అధికారులు తెలిపారు. నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు ఏవీ లేవు. కొద్దిసేపు భూమి కంపించడంతో, ముందు జాగ్రత్తగా కొందరు ఇళ్లలోంచి బయటకు వచ్చారని స్థానికులు తెలిపారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల ఖర్చును తిరిగి చెల్లిస్తే.. అసెంబ్లీ స్థానాన్ని వదులుకుంటాం.. కోనేటి సుమన్