42.5 కి.మీ.లో విశాఖ మెట్రో... రూ. 8.300 కోట్ల వ్యయం
విశాఖపట్నంకు మెట్రో రైల్ వచ్చేస్తోంది. నగరంలో 42.5 కిలోమీటర్లలో ఈ రైలు తిరగనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కొమ్మాది నుంచి గాజువాక వరకూ 30.8 కి.మీ., గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకూ 5.25 కి.మీ., తాటిచెట్ల పాలెం నుంచి చి
విశాఖపట్నంకు మెట్రో రైల్ వచ్చేస్తోంది. నగరంలో 42.5 కిలోమీటర్లలో ఈ రైలు తిరగనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కొమ్మాది నుంచి గాజువాక వరకూ 30.8 కి.మీ., గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకూ 5.25 కి.మీ., తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకూ 6.91 కి.మీ.... ఇలా 42.5 కిలోమీటర్లలో మెట్రో రైలు నడవనుందని మంత్రి తెలిపారు. పీపీపీ పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రూ.8,300 కోట్లు వ్యయమవుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.4,200 కోట్లు, పనులు ప్రారంభించే సంస్థ రూ.4,100 కోట్లు భరించనున్నాయన్నారు. ఇప్పటికే తెరిచిన టెండర్లలో ఆదాని, టాటా రియాల్టీ, షార్పూజీ పల్లాన్జీ, ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్టు, ఐఎల్ అండ్ రైల్ సంస్థలు రేసులో నిలిచాయన్నారు.