Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబుకు కొత్తరకం మానసిక వ్యాధి: బొత్స

webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (20:15 IST)
చంద్రబాబుకు అబద్దాలు మాట్లాడితే తప్ప కాలం గడవదని, లేకపోతే చూసేవారు, వినేవారు ఉండరన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్ససత్యనారాయణ అన్నారు. అయితే, అలా కాకుండా వాస్తవాలు లేకుండా ఏదో మాట్లాడితే ప్రజలు విని.. నిజమని అనుకుంటారంటే పొరపాటు అన్న సంగతి చంద్రబాబు తెల్సుకోవాలని బొత్స తెలిపారు.

ఇవాళ  మొదట చంద్రబాబు కరోనా గురించి మాట్లాడారు. మన రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 35వేల కరోనా టెస్టులు చేశారు. ఇది వాస్తవం కాదా? చంద్రబాబు చెప్పండని బొత్స నిలదీశారు. సుమారు (8.70 లక్షలు) 9 లక్షల కరోనా టెస్టులు రాష్ట్రంలో జరిగాయని, పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా జరిగాయా.. ఇన్ని టెస్టులు జరిగాయా.. అని దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉన్నదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఇది వాస్తవం కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు నోరు విప్పితే అబద్ధాల పుట్ట అని తేటతెల్లం అవుతోందన్నారు. కరోనా  కట్టడికి సీఎం ప్రయత్నిస్తూనే ప్రజాజీవితం సాఫీగా సాగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా? దేశమంతా లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో రైతులు, శ్రామికులు, వలస కూలీలు ఎవ్వరూ ఇబ్బందిపడకుండా ప్రతి రోజు సీఎం సమీక్షించి చర్యలు చేశారో రాష్ట్ర ప్రజానీకానికి తెలీదా? నీకు(చంద్రబాబు)కు తెలీదా చెప్పు అని బొత్స సత్యనారాయణ అడిగారు.

అయితే, ఏదో ఒక అబద్ధాలు చెప్పాలని, ఆరోపణలు  చేయాలని చంద్రబాబు చూస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఒక డాక్టర్‌ సుధాకర్‌ను తీసుకొచ్చి కొట్టారు, తిట్టారు.. పోలీసులు హింసించారని చంద్రబాబు చెబుతారు. ప్రజాస్వామ్యంలో తన (డాక్టర్‌ సుధాకర్‌) తాలూక ధర్మాన్ని నిర్వహిస్తే ఎవరు అభ్యంతరం చెబుతారని బొత్స ప్రశ్నించారు. తాగి తందనాలు ఆడి.. రోడ్డుమీద వచ్చి విచ్చలవిడిగా ఉండి.. ఇంకొకరి ప్రాధమిక హక్కులకు భంగం కలిగితే చట్టం తనపని తాను చేసుకొని వెళ్తుంది. ఇది వాస్తవం కాదా?

చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ నాయకులు రోడ్డు మీద వెళ్తే ఎవరైనా వచ్చి తిట్టినా, కొట్టినా ఊరుకుంటారా అని బొత్స నిలదీశారు. నిన్న సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి ఎంఎస్‌ఎంఈల రెండో విడత బకాయిలు విడుదల చేశారు. దానిమీద ఏం మాట్లాడుతున్నారు? పాత బకాయిలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? దానికోసం ఇంత పబ్లిసిటీనా అని చంద్రబాబు అనటం ఏంటని బొత్స ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

చంద్రబాబు మాటలు వింటుంటే నవ్వు వస్తోందన్నారు. పాత బకాయిలు కానీ, పాత విధానాలు కానీ, ఇండస్ట్రియల్ పాలసీ వచ్చే ప్రభుత్వాలు చేయాలి. దాని కాలపరిమితి ఐదు సంవత్సరాలు, పది సంవత్సరాలు ఉంటే అవలంభించాలి. అది వాస్తవం. నేను పరిశ్రమల మంత్రిగా చేశాను. అది నాకు కూడా తెల్సని బొత్స సత్యనారాయణ తెలిపారు. అది ఒక సంవత్సరమో, ఆరు నెలల్లో బకాయిలు ఉంటే ఇస్తారు.

అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ప్రోత్సహక బకాయిలు ఎగ్గొట్టి వందల, వేల కోట్లు బకాయిలు పెట్టి తగుదునమ్మా అని ఇవాళ చంద్రబాబు వచ్చి మాట్లాడటం ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఏం చేస్తారని అనటంపై బొత్స మండిపడ్డారు.  
 
చంద్రబాబు ఐదేళ్లుగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు బకాయిలు ఇవ్వలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వేల కోట్లు ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వలేదు. 108, 104 ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేదు. రైతులకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా బకాయిలు ఇవ్వలేదని బొత్స పేర్కొన్నారు. ఎక్కడైనా ఒక్క సంవత్సరం బకాయిలు అయితే ప్రభుత్వం వెంటనే తీరుస్తుందని అన్నారు. కానీ 2014-15 నుంచి బకాయిలు వేల కోట్లు ఉంచి పైగా ఇవ్వరా? బకాయిలు ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత కాదా అని చంద్రబాబు అనటం సరికాదన్నారు.
 
40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు చేసిన ఘనకార్యాలు ఇవని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.32 వేల కోట్లు పాత బకాయిలు, రూ.16 వేల కోట్లు లోటుబడ్జెట్‌ ఉందని చంద్రబాబు చెబుతారు. మరి, ఈరోజు పాత బకాయిలే రూ.60,000 కోట్లు పెట్టారని అన్నారు. రూ.2.75 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని దించారు. ఇదీ చంద్రబాబు గుడ్‌ గవర్నెన్స్ అని బొత్స ఎద్దేవా చేశారు.
 
చంద్రబాబు పెట్టిన బకాయిల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని బొత్స సత్యనారాయణ వివరించారు. కాకినాడలో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమకు భూమి ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్నారని చంద్రబాబు అంటారు. ఇచ్చిన భూమిని సక్రమంగా వినియోగించుకుంటే దాన్ని కంటిన్యూ చేస్తారు. పరిశ్రమకు తీసుకొని రియల్‌ ఎస్టేట్‌కో, పరిశ్రమ నిర్ణీత కాలవ్యవధిలో రాకపోతే ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో ఏం చేస్తుందో చంద్రబాబుకు తెలీదా అని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు. పైగా మీడియాలో గంటల కొద్దీ చూపిస్తారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రతిష్టాత్మకరమైన కార్యక్రమం చేస్తోందని బొత్స సత్యనారాయణ తెలిపారు. స్వర్గీయ రాజశేఖరరెడ్డి గారి ఆలోచనతో దేశంలోనే మొట్టమొదటిసారిగా 108 తీసుకువచ్చింది. విదేశాల్లో టెక్నాలజీని ఆంధ్రరాష్ట్రంలోకి మొట్టమొదటిసారి తీసుకువచ్చారు. తీసుకువచ్చిన 108, 104ను గత ఐదేళ్లలో నీరుగార్చారు. ప్రతి ఊరుకు 104 వచ్చి టెస్టులు చేసి మందులు ఇచ్చేవారు. గత 5 ఏళ్లలో ఎక్కడైనా 104 కనిపించిందా అని బొత్స ప్రశ్నించారు.

పాము కరిచింది.. చెట్టు నుంచి పడిపోయారు, కాలినొప్పి అయింది.. గర్భిణీ డెలివరీ అంటే 20 నిమిషాల్లో వచ్చి ఆసుపత్రికి తరలించేవారు. గత ఐదేళ్లలో ఎప్పుడైనా చూశామా? ఫోన్‌ చేస్తే.. గాలి లేదు, టైర్‌ లేదు, డ్రైవర్ లేడు, బ్రేక్‌ డౌన్ మాటలు వినవచ్చేవి. ఇవి నిజం కాదా? ఇవాళ అలా కాకుండా 104 వాహనాలు  సుమారు 680 వాహనాలు ఒకేసారి ప్రారంభించనున్నారు. అది చూసి ప్రతిపక్షానికి కడుపు మండిపోతోందని బొత్స ఎద్దేవా చేశారు.

మొత్తం 108, 104 వాహనాల విలువ చూస్తే రూ.200 కోట్లు. ప్రతిపక్షం మాత్రం రూ.300 కోట్ల స్కాం అనటం ఏంటని బొత్స ప్రశ్నించారు. టీడీపీ నాయకులు వచ్చి చూడండి. లేకపోతే ఇంట్లో కూర్చొని చూడండని బొత్స సూచించారు. రేపు ఇది ఎందుకు పెడుతున్నారంటే.. 108, 104 నిర్వీర్యం అయిపోయిందని జగన్ చేతుల మీదుగా చేస్తుంటే.. దాని మీద అపవాదు వేయటం ఏంటని బొత్స మండిపడ్డారు. 
 
మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావనే అలవాటు టీడీపీ నాయకులకు, పెద్దలకు అలవాటని బొత్స సత్యనారాయణ అన్నారు. దాన్ని అందరికీ ఆపాదిస్తే ఎలాగా అని బొత్స నిలదీశారు. దీనికి సమాధానం చెప్పండని బొత్స అడిగారు. షేర్‌ వాల్‌ టెక్నాలజీ తెస్తానని చంద్రబాబు చెప్పి ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని బొత్స తెలిపారు.

ఐదేళ్లలో ప్రజలకు ఒక్క ఇళ్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలని అందులో అవినీతి కంపు కొడుతోందని అన్నారు. రూ.3,000 కు  రివర్స్ టెండరింగ్‌కు వెళ్తే రూ.400 తక్కువకే కోట్ చేశారని దీనిబట్టే అందులో ఎంత అవినీతి ఉందో తెలుస్తోందన్నారు.
 
రాజశేఖర రెడ్డి జయంతి రోజున 30 లక్షల ఇళ్ల స్థలాలు ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతోందోని బొత్స తెలిపారు. అవి జరగకూడదని న్యాయపరమైన సాంకేతిక కారణాలు తెచ్చి జరగకూడదని చేస్తున్నారు. ఇది తప్పు కాదా? పాపం కాదా? న్యాయమేనా?  ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రతిపక్షాలను ప్రజలు క్షమిస్తారా ..అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

రాజకీయ పార్టీ మంచి కార్యక్రమానికి ముందుకు రావాలి. పది మంది హర్షించాలి కానీ ఇలాంటి కార్యక్రమాలా అని బొత్స నిలదీశారు. పైగా లేనిపోని ఆరోపణలు ఆపాదిస్తున్నారని బొత్స మండిపడ్డారు. విశాఖపట్నంలో ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తున్నామని స్వచ్ఛందంగా రైతులు ఇచ్చిన భూములు తప్ప దౌర్జన్యంగా కానీ వారిని ఇబ్బంది పెట్టాలని కానీ ఏ ఒక్కటీ చేయటలేదని చెప్పామని ఆ మాటకు కట్టుబడి ఉన్నామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఏదైనా అవకతవకలు జరిగితే ఆ సంబంధిత శాఖకు మంత్రిగా నేను బాధ్యత వహిస్తానని, నాదే బాధ్యత అని చెప్పానని బొత్స తెలిపారు. గతంలో చంద్రబాబు హయాంలో ఎవరైనా ఈ మాట చెప్పారా? చంద్రబాబూ చెప్పు.. అని బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు. ఈ మాట మరోసారి చెబుతున్నాను. తప్పుకు తనే బాధ్యత వహిస్తానని బొత్స సత్యనారాయణ తెలిపారు. 
 
100కి నూరు శాతం ఏ చిన్న తప్పు లేకుండా.. అవినీతి లేకుండా.. పేదలకు ఇబ్బందులు లేకుండా.. సీఎం జగన్  స్ఫూర్తితో ల్యాండ్ పూలింగ్ చేశామని బొత్స తెలిపారు. దాంట్లోనూ సాంకేతిక పరమైన కారణాలు చూపిస్తూ.. కోర్టు నుంచి స్టే తీసుకువస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఎటువైపు వెళ్తున్నారు. ఏమైపోతోందని బొత్స ప్రశ్నించారు. 
 
సుమారు 1088 అంబులెన్స్‌లు108, 104ను సీఎం వైయస్‌ జగన్ ప్రారంభిస్తుంటే దానికి మరక అంటించాలని టీడీపీ చూస్తోందని మండిపడ్డారు. అసలు 1088 అంబులెన్స్‌లు అంటే మాటలా అని బొత్స అన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేశారా అని బొత్స ప్రశ్నించారు.

ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని, అంబులెన్స్ సర్వీస్‌ తిరగకూడదని చంద్రబాబు మనస్సులో ఇది ఆగిపోవాలని అనుకోవచ్చు, కుట్రలు పన్నొచ్చు. కానీ పేదవారికి సాయం జరగాలనే సీఎం జగన్ కృతనిశ్చయానికి, మంచి ఆలోచనకు ధృడ సంకల్పం జరిగి తీరుతుందని దానికి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని బొత్స స్పష్టం చేశారు. అన్నీ నెరవేరుతాయి. ఏ ఒక్కటీ ఆగవు. అన్నీ మంచే జరుగుతాయన్నారు.

1088 అంబులెన్స్‌లు అన్నీ పేదవారి ఆరోగ్యం కోసమన్నారు. ఎవరికైనా చిన్న ఇబ్బంది వచ్చినా 15 నిమిషాల్లో ఆదుకునేలా చేస్తున్నారని అన్నారు. మారుమూల ఆసుపత్రిలో రాలేని నిస్సహాయులను ఆదుకునే కార్యక్రమం 104 అని దీన్ని ఎవ్వరూ ఆపలేరని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 
 
పోలవరంలో అవినీతి జరగలేదు అని కేంద్రమంత్రి చెబుతున్నారంట. వింటే.. నవ్విపోతారు. నేను రాష్ట్రానికి మంత్రిని, రాష్ట్రానికి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని నేను ఒక కార్యక్రమం చెబితే.. ఇది ప్రభుత్వ విధానం ఇదని ముఖ్యమంత్రి చెబితే అదే ఫైనల్ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. అవునా? కాదా అని బొత్స ప్రశ్నించారు.

సాక్షాత్తూ దేశ ప్రధానే పోలవరం ఏటీఎం అని చెప్పారు. ఎనీ టైం మనీ లా.. చంద్రబాబు డ్రా చేసుకోవచ్చని సాక్షాత్తూ దేశ ప్రధానే చెప్పింది అవాస్తవమా? చెప్పండి చంద్రబాబు అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 
 
అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో ఆయన నిర్వహించిన శాఖలో అవకతవకలు దర్యాప్తులో భాగంగా చర్యలు తీసుకున్నారని చెప్పాను. దాంట్లో అవినీతి జరిగిందని ప్రాధమికంగా తేల్చారని చెప్పారు. న్యాయస్థానాలు చెబుతున్నాయి. సంబంధిత శాఖలు చెబుతున్నాయి. అందులో వచ్చింది చంద్రబాబు దగ్గర ఉందా? లోకేశ్‌ దగ్గర ఉందా? అన్న అనుమానాలు ఉన్నాయి.

అచ్చెన్నాయుడు వద్ద అందులో జరిగిన దాంట్లో 10-20% అవినీతి ఉంటే ఉండొచ్చు. కానీ, మిగతాది అంతా చంద్రబాబు, లోకేశ్ దగ్గరే ఉంటుందని బొత్స అన్నారు. అందువల్లే చంద్రబాబు అందులో అవినీతి జరగలేదని ధైర్యంగా చెప్పలేకపోతున్నారని బొత్స సత్యనారాయణ నిలదీశారు. చంద్రబాబు తన ప్రభుత్వంలో నీతివంతంగా పాలన జరిగిందని ఎందుకు చెప్పలేకపోతున్నారని బొత్స ప్రశ్నించారు.

ఎక్కడైనా అవినీతి జరిగితే కేబినెట్ సమిష్టి బాధ్యత మంత్రివర్గానిది, దానికి బాధ్యతవహిస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పటంలేదు. కారణం ఏంటని బొత్స తెలిపారు. అది నీ కొడుకు చేస్తే చెప్పటం మానేస్తావా చంద్రబాబు అని బొత్స నిలదీశారు. అచ్చెన్నాయుడు పోతేపోతాడులే అని చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. పైపెచ్చు వెనకేసుకు వస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. మీరే కదా చెప్పింది దమ్ముంటే ఎంక్వైరీలు చేయండని అన్నారు. 
 
లోకేశ్ మాట్లాడుతూ.. రోజుకు 100 సిఫార్సు లెటర్లు ఇచ్చామని, లోకేశ్‌ కూడా అచ్చెన్నాయుడు లాగే ఇచ్చి ఉంటే తనకు అదే తప్పదని బొత్స హెచ్చరించారు. మాజీ మంత్రిగా పనిచేసిన లోకేశ్‌ అలా ఖాతరు లేని మాటలు మాట్లాడటం ఏంటని, ఒకవేళ లేఖలో అలా రాయటం వల్ల జరిగిన తప్పు ఏంటో అడగాలని బొత్స సూచించారు. అంతేకానీ ఎంతమందికైనా లేఖలు ఇస్తామనటం ఏంటని బొత్స మండిపడ్డారు. 
 
బీసీలకు రిజర్వేషన్ల అంశంలో ప్రత్యక్షసాక్షిని అని బొత్స సత్యనారాయణ అన్నారు.  50% మించి ఉండకూడదని కోర్టులో అంశమని సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డికి చెప్పానని అన్నారు. అయినా సీఎం వైయస్‌ జగన్ 63% ఉండాలని చెప్పారు. కానీ చంద్రబాబు మనుషులే కోర్టులకు వెళ్లారన్నారు. పైగా బీసీల తాలూక ప్రయోజనాలు దెబ్బతీసేలా చంద్రబాబే వ్యవహరించారని అది నోరా? తాటిమట్టా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో చెప్పారు. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు మేలు ఈ ప్రభుత్వమే చేస్తోందని బొత్స తెలిపారు. మార్కె్‌ట్‌ కమిటీల్లో బీసీ మహిళలకు రిజర్వేషన్లు గతంలో చూశామా? ఎస్సీలు, ఎస్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో, దేవాలయ కమిటీల్లో జరిగిందా? ఇప్పుడు ఎలా వచ్చాయని బొత్స ప్రశ్నించారు.

గత ప్రభుత్వాలు ఎందుకు ఇవి ఇవ్వలేకపోయాయని బొత్స అడిగారు... వారికి ఆ చిత్తశుద్ధిలేకపోవటమే కారణమన్నారు. ఆ ఆలోచనతో పాటు, చిత్తశుద్ది, పట్టుదల సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డికి ఉండటం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని తెలిపారు. 
 
రాజధాని ఉద్యమం 200 రోజులు అవుతోందని వర్చువల్ నిరసనలు చేయండని చంద్రబాబు మోసం చేస్తున్నారు. కనీసం కరకట్ట రోడ్డును ఐదేళ్లలో చంద్రబాబు బాగు చేయలేకపోయారు. పైగా పెద్దపెద్ద కబుర్లు చెబుతూ వర్చువల్ నిరసనలు చేయండి...నేను జూమ్‌లో ఉంటాను.. మీరు రండి అంటూ.. చంద్రబాబు మోసగిస్తున్నారన్నారు.

గత ప్రభుత్వాలు ఇచ్చిన ఒడంబడికలు నెరవేర్చుకుంటూ.. వారు చేసిన అప్పులు తీరుస్తూ, అక్రమాలు కట్టడి చేస్తూ పరిపాలన చేస్తుంటే.. ప్రతిపక్షం ఇష్టారాజ్యంగా మాట్లాడుతోందని బొత్స మండిపడ్డారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు పోస్టింగ్‌ పెడుతు మనసు బాధకలిగేటట్లు, ఇబ్బంది పడేటట్లు చేస్తున్నారు. ఇలాంటి నీచమైనా, అనైతిక కార్యక్రమం టీడీపీ చేస్తోంది. దానిపైన చర్యలు తీసుకుంటుంటే 70 సంవత్సరాల వారిమీద చర్యలు తీసుకుంటున్నారని గగ్గోలు పెట్టడం ఏంటని బొత్స అన్నారు.

70-80 ఏళ్ల వారు వారి వయస్సు తగ్గట్లు ప్రవర్తన ఉండాలి. వెధవ పనులు చేస్తే చర్యలు తీసుకోకూడదా? వారి వయస్సుకు తగ్గట్లు వ్యవహరిస్తే అందరూ దీవిస్తారు. నీచమైన కార్యక్రమాలు, వక్రమైన కార్యక్రమాలు, చట్టానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తే ఎలా అని బొత్స ప్రశ్నించారు. పైగా వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. 20 ఏళ్ల కుర్రోడు చేశాడంటే.. పక్కోడు చెప్పాడని విని చేశారని అనుకుంటారు. 80 ఏళ్ల అతను చేస్తే ఎలా అని బొత్స నిలదీశారు. 
 
విశాఖపట్నంలో ఇటీవల గ్యాస్‌ లీకై కొంతమంది ప్రజలు చనిపోయారు. పెద్ద సంఘటన జరిగింది. చంద్రబాబు, లోకేశ్ కానీ అక్కడకు వెళ్లారా? తగుదునమ్మా అంటూ .. విశాఖపట్నం లోకేశ్‌ వచ్చి అచ్చెన్నాయుడు కుటుంబాన్ని చూడటానికి వెళ్లారు. కానీ గ్యాస్ బాధిత కుటుంబాల దగ్గరకు వెళ్లి పరామర్శించవచ్చు కదా. రాజకీయాలు, రాష్ట్రంలో పరిణామాల గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే ఏమనుకోవాలని బొత్స అన్నారు.

దేశమంతా కరోనా పెరిగిపోయిందని ప్రధాని కూడా మాట్లాడారు. 7 రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదు అవుతుంటే.. ఆంధ్ర రాష్ట్రం గురించి చంద్రబాబు మాట్లాడటం ఏంటని బొత్స నిలదీశారు. అసలు చంద్రబాబుది నోరా, తాటిమట్టా అని బొత్స మండిపడ్డారు. పచ్చకామెర్లు ఉన్నవాడికి పచ్చగా కనిపిస్తున్నట్లు చంద్రబాబు మాట్లాడటం ఏంటని బొత్స ప్రశ్నించారు. 
 
ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం నెరవేరాలని అది కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరికీ అందాలని సీఎం వైయస్ జగన్ కోరుకుంటున్నారు. రైతులు, రైతు కూలీలు, కార్మికులు ఆనందంగా ఉండాలని ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తోందని బొత్స సత్యనారాయణ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

తమిళనాడులో 90వేల మార్కును దాటిన కరోనా.. ఒకే రోజు 60మంది మృతి