Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రిపుర - మేఘాలయ - నాగాలాండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ .. ఫైనల్ రిజల్ట్స్ ఇవే...

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. ఇందులో త్రిపురలో ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పే హైలెట్‌గా నిలిచింది.

Advertiesment
త్రిపుర - మేఘాలయ - నాగాలాండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ .. ఫైనల్ రిజల్ట్స్ ఇవే...
, శనివారం, 3 మార్చి 2018 (20:48 IST)
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి.  ఇందులో త్రిపురలో ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పే హైలెట్‌గా నిలిచింది. దాదాపు 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష కూటమిని గద్దె దింపి భాజపా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతుంది. ఓట్ల లెక్కింపు ఆరంభంలో సీపీఎం, బీజేపీ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగినా.. చివరికి బీజేపీనే విజయం వరించింది. 
 
ఎవరూ ఊహించని రీతిలో ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుతో దేశంలోని మెజారిటీ ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఘోర పరాజయంతో వామపక్ష పార్టీల చేతి నుంచి మరో రాష్ట్రం చేజారింది. ప్రస్తుతం కేరళలో మాత్రమే అధికారంలో ఉంది. గతంలో 2011 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న వామపక్ష కూటమి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఒడిపోయిన విషయం తెలిసిందే. 2016 ఎన్నికల్లోనూ పుంజుకోలేకపోయింది. 
 
ఇకపోతే, కాంగ్రెస్ పార్టీకి త్రిపుర, నాగాలాండ్ ఓటర్లు ఒక్క సీటును కూడా కట్టబెట్టలేదు. కానీ మేఘాలయలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ రాష్ట్రంలో 21 సీట్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. అలాగే, నాగాలాండ్ రాష్ట్రంలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ ఎన్.పి.ఎఫ్ 24 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 21 సీట్లు సాధించి రెండో పార్టీగాను, ఇతరులు రెండు సీట్లలో విజయం సాధించారు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల తుది ఫలితాలను విశ్లేషిస్తే... 
 
త్రిపుర.. 
మొత్తం స్థానాలు 60
ఎన్నికలు జరిగిన స్థానాలు 59
బీజేపీ 43
సీపీఎం 16
 
నాగాలాండ్
మొత్తం స్థానాలు 60
ఎన్నికలు జరిగిన స్థానాలు 59 
బీజేపీ 29
ఎన్.పి.ఎఫ్ 25
ఇతరులు 6
 
మేఘాలయ 
మొత్తం సీట్లు 60
ఎన్నికలు జరిగిన స్థానాలు 59
కాంగ్రెస్ 21
ఎన్.పి.పి. 19
యూడీపీ 6
బీజేపీ 2
ఇతరులు 11
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్తాం: మావో చీఫ్ జగన్