Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బార్బర్ షాపులో వ్యక్తికి మెడ తిప్పుతూ మసాజ్, పక్షవాతం వచ్చేస్తుందా? (video)

Advertiesment
Man paralyzed while twisting his neck at barber shop

ఐవీఆర్

, శుక్రవారం, 7 నవంబరు 2025 (11:46 IST)
కర్టెసి-ట్విట్టర్
సుశిక్షితులైన వారితో కాకుండా ఎవరుబడితే వారితో మర్దన చేయించుకున్నా, లేదంటే వళ్లు నొప్పులుగా వున్నాయనో, మెడ నొప్పిగా వుందనో కాస్త నొక్కమని చెబితే తేడా వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధింది ఓ వీడియో వైరల్ అవుతోంది. బార్బర్ షాపుకి వచ్చిన వ్యక్తి చాలా సరదాగా కుర్చీలో కూర్చున్నాడు. క్షురకుడు ముందుగా అతడి చేతులు నొక్కాడు. ఆ తర్వాత మెడను పట్టుకుని ఒక్కసారిగా గబుక్కున తిప్పాడు.
 
ఆ వ్యక్తి కాస్త అసౌకర్యానికి గురయ్యాడు. ఇంతలో మళ్లీ గట్టిగా మరోసారి మెడను పట్టుకుని మరోవైపు తిప్పాడు. అంతే... ఆ వ్యక్తి చేయి, కాలు, మూతి వంకర్లు తిరుగుతూ పక్షవాతానికి గురై మాట పడిపోయింది. కుర్చీలో అలా బిగుసుకుపోయాడు. ఈ వీడియోను పోస్ట్ చేసిన వైద్య నిపుణులు... ఇలా మర్దనలు చేసుకునేటప్పుడు జాగ్రత్త. సుశిక్షితులైనవారు కాకుండా ఇలాంటివారు చేస్తే ప్రాణానికి ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. కాగా ఇది ఓ స్క్రిప్టెడ్ వీడియా అంటూ ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేలింది. ఐతే సుశిక్షితులు కాని వారు చేస్తే మాత్రం ఇలాంటి ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vande Mataram: వందేమాతరం 150వ వార్షికోత్సవం.. అమిత్ షా, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?