Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గొంతుబాగుందని వేధించాడు.. ఆపై ఇంటికెళ్లి రేప్ చేయబోయాడు- నగ్నంగా సంచరించిన వ్యక్తి అరెస్ట్

పొరపాటున వేరే వ్యక్తికి కనెక్ట్ అయ్యింది. సారీ రాంగ్ నెంబర్ అంటూ ఆ యువతి చెప్పేసింది. అయితే ఆమె గొంతు వినడానికి ఇంపుగా ఉండటంతో ఆమెకు మళ్లీ మళ్లీ ఫోన్ చేసి సదరు వ్యక్తి విసిగించాడు. బాధిత మహిళ బెదిరించ

Advertiesment
Maharani College
, గురువారం, 23 మార్చి 2017 (11:59 IST)
పొరపాటున వేరే వ్యక్తికి కనెక్ట్ అయ్యింది. సారీ రాంగ్ నెంబర్ అంటూ ఆ యువతి చెప్పేసింది. అయితే ఆమె గొంతు వినడానికి ఇంపుగా ఉండటంతో ఆమెకు మళ్లీ మళ్లీ ఫోన్ చేసి సదరు వ్యక్తి విసిగించాడు. బాధిత మహిళ బెదిరించినా ఫలితం లేకపోయింది. అంతేగాకుండా ఆమె వివరాలు సేకరించి..ఆమె ఇంటికే వెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని కృష్ణరాజపుర పరిధిలో ఉన్న రామ్మూర్తి నగర్‌కు చెందిన యువతి.. ఇటీవల తన బంధువులకు ఫోన్ కాల్ చేస్తున్న సందర్భంలో.. పొరపాటున అది రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన రోహిత్ అనే వ్యక్తికి కనెక్ట్ అయింది. పొరపాటున కాల్ వచ్చిందని చెప్పినా.. అతగాడు వినిపించుకోలేదు. యువతిని వేధించడం మొదలెట్టాు. అసభ్యకర మెసేజ్‌లు పంపించాడు. ఈ క్రమంలో అనేకసార్లు సదరు మహిళ అతన్ని హెచ్చరించినా.. లాభం లేకుండా పోయింది. పైగా అతను మరింతగా రెచ్చిపోవడం మొదలుపెట్టాడు.
 
ఏకంగా మొబైల్ నంబర్ ఆధారంగా మహిళ ఉంటున్న ఇంటి చిరునామా కనుక్కుని ఇంటికే వచ్చేశాడు.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే అప్రమత్తమైన బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో పాటు పెద్దగా కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కృష్ణరాజపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇదిలా ఉంటే.. బెంగళూరులోని మహారాణి కాలేజీ హాస్టల్‌పై ఉండే మహిళల లో దుస్తులను దొంగలించేందుకు నగ్నంగా సంచరించే ఓ సైకోను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వ్యక్తి పేరు అబు తలిబ్ (30) అని... ఇతడు బీహార్‌కు చెందిన వాడని పోలీసులు గుర్తించారు. హార్స్ రేసు కోర్స్‌లో పదేళ్ల పాటు పని చేసిన ఇతడు.. మానసిక సమస్యకు గురైన వాడని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ దేశంలో ప్రతి రోజూ 11 మంది మైనర్లపై అత్యాచారాలు...