Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఫిబ్రవరి 13-14 తేదీలలో మహాశివరాత్రి వేడుకలు(Video)

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఫిబ్రవరి 13, 14 తేదీలలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని

ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఫిబ్రవరి 13-14 తేదీలలో మహాశివరాత్రి వేడుకలు(Video)
, సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (20:35 IST)
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఫిబ్రవరి 13, 14 తేదీలలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీశైల మల్లిఖార్జున స్వామివార్ల దేవస్థానం, ఆదిలీల ఫౌండేషన్, ఢిల్లీలోని తెలుగు సంస్థల సహకారంతో ఆంధ్రప్రదేశ్ భవన్‌లో అఖండ నాదోపాసన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కూచిపూడి నృత్యరూపకం, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.
 
ఈ నెల 13వ తేది  మంగళవారం ఉదయం గం.10.00ల నుంచి 14వ తేది ఉదయం గం.10.00ల వరకు నిర్విరామంగా బ్రహ్మశ్రీ డా. తాడేపల్లి లోకనాధ శర్మ వారిచే అఖండ నాదోపాసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 13వ తేది సాయంత్రం గం.6.30లకు డా. బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో కృష్ణా జిల్లా కూచిపూడి కళాక్షేత్రంకు చెందిన డా. చింతా రవిబాలకృష్ణ బృందంచే కూచిపూడి నృత్య రూపకం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
 
14వ తేది ఉదయం 10.00ల నుంచి మధ్యాహ్నం గం.1.00 వరకు శ్రీశైలం దేవస్థానం, శ్రీశైలం ప్రధానార్చకులు, మఠం శివశంకరయ్య స్వామి, శ్రీ భ్రమరాంబ అమ్మవారి ఆలయం, శ్రీశైలం దేవస్థానం ముఖ్య అర్చకులు భాగవతుల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రిల ఆధ్వర్యంలో సామూహికంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమానంతరం భక్తులకు, ఆహూతులకు శ్రీశైల దేవస్థానం వారిచే శ్రీశైల భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామివార్ల విభూతి, కుంకుమ, కైలాస కంకణాలు, శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదం అందచేస్తామని అనంతరం మహాప్రసాద వితరణ ఉంటుందని రెసిడెంట్ కమీషనర్ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతిఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యాచారం చేయబోతే ప్రతిఘటించింది.. అంతే కిరోసిన్ పోసి నిప్పంటించాడు..