ఈ రోజు రాత్రి గం. 10:56 నిమిషాలకు చంద్ర గ్రహణం.. పాటించాల్సిన నియమాలు
ఈ రోజు రాత్రి చంద్రగ్రహణం రాత్రి 10:56 నిమిషాలకు ప్రారంభమవుతుంది. గ్రహణ మధ్యకాలం రాత్రి 11:54 నిమిషాలకు, మోక్షకాలం రాత్రి 12:53 నిమిషాల వరకూ వుంటుంది. ఆద్యంత పుణ్యకాలం 1:57 నిమిషాల వరకు ఉంటుందని పంచాగకర్తలు, వేద పండితులు చెబుతున్నారు.

పాటించవలసిన నియమాలు
గ్రహణ కాలానికి 9 గంటల ముందే భుజించాలనేది నియమం. అలాగే ఆ తర్వాత ఎలాంటి భోజన పదార్థాలను భుజింపరాదు. శుభ ఫలము ఉన్న రాశివారు అనుష్ఠానాదికాలు చేసుకొనేందుకు సరైన సమయమేమిటో పండితులను అడిగి తెలుసుకోవాలి. మధ్యమ ఫలము ఉన్నవారితోపాటు అధమ ఫలము ఉన్నవారు కూడా వస్త్ర, ధాన్య, శాకాది, దానాలను శక్తికొద్దీ చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రహణ కాలం వరకూ దేవతామూర్తుల పైన, అలాగే నిల్వ ఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసి గ్రహణ అనంతరం తీసి వేయాలని పండితులు చెపుతున్నారు. గ్రహణం ముగిసిన మరుసటి రోజు దేవతా మందిరాన్ని, దేవతామూర్తులను శుద్ధి పరచుకోవాలని పండితులు వెల్లడిస్తున్నారు. గ్రహణ సమయంలో దేవతా పూజలు అభిషేకాలు చేయరాదు. ఉపదేశిత మంత్రము లేదా ఏదైనా దేవతా నామాన్ని జపిస్తే గణనీయ ఫలము సిద్ధిస్తుందని చెపుతున్నారు.