Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను ప్రేమించిన అమ్మాయినే నువ్వూ ప్రేమిస్తావా? ఐతే చావు

ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ప్రేమించిన అమ్మాయిని మరో యువకుడు ప్రేమిస్తున్నాడనే కారణంతో అతడిని దారుణంగా చంపించాడు. రేణిగుంట మండలం గాజుల మండ్య సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. రేణుగుంట మండలం గాజుల మండ్యలో జ

Advertiesment
నేను ప్రేమించిన అమ్మాయినే నువ్వూ ప్రేమిస్తావా? ఐతే చావు
, శనివారం, 4 ఆగస్టు 2018 (22:14 IST)
ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ప్రేమించిన అమ్మాయిని మరో యువకుడు ప్రేమిస్తున్నాడనే కారణంతో అతడిని దారుణంగా చంపించాడు. రేణిగుంట మండలం గాజుల మండ్య సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. రేణుగుంట మండలం గాజుల మండ్యలో జానకీరాం (20), వంశీ (20) బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. 
 
ఈ క్రమంలోనే ఒకే అమ్మాయిని ఈ ఇద్దరు యువకులు ప్రేమించారు. ప్రేమ విషయమై కాలేజీలో ఇద్దరూ తరచూ గొడవపడేవారు. దీంతో ఎలాగైనా జానకీరాంను తప్పించాలని ప్లాన్ చేశాడు వంశీ. తను నీ ప్రేమకు అడ్డు రానని మన మధ్య గొడవల వద్దు అంటూ జానకీరాంకి చెప్పాడు. సరదాగా తమ ఊరికి వెళదామని చెప్పిన వంశీ, మరో ఆరుగురు సహచర విద్యార్థులతో కలిసి గాజులమండ్యం సమీపంలో ఓ రిసార్టుకు వెళ్లారు. 
 
అయితే అప్పటికే పక్కా ప్లాన్‌తో ఉన్న వంశీ.. తన వెంట తెచ్చుకున్న కత్తితో జానకీరాం పైన, అడ్డు వచ్చిన మరో విద్యార్థి దిలీప్‌ పైనా దాడి చేశాడు. అక్కడికక్కడే జానకీ రామ్ చనిపోవడంతో వంశీ పారిపోయాడు. దిలీప్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు ఇతర స్నేహితులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిఠాపురంలో జగన్‌కు స్వాగతం పలికింది నకిలీ కాపులా?