వైకాపా నుంచి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తుది జాబితాను ప్రకటించడం జరిగింది. ఈ జాబితా ప్రకటన తర్వాత అత్యంత రిలీఫ్ అయిన ఇద్దరు నేతలు ఎవరంటే.. నగిరి ఎమ్మెల్యే రోజా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, రోజాకు నగిరి ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కకపోవచ్చని మీడియాలో లెక్కలేనన్ని ఊహాగానాలు వినిపించాయి.
అదృష్టవశాత్తూ రోజా ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నగరి ఎమ్మెల్యే టిక్కెట్‌ను కాపాడుకోగలిగారు. వల్లభనేని వంశీ గత కొన్ని వారాలుగా ఏపీ రాజకీయాలలో ఎక్కడా కనిపించకపోవడంతో గన్నవరం ఎన్నికల పోరులో ఆయన స్థానంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ తనకు టికెట్ ఇస్తుందా లేదా అనే అనుమానంలో ఆయన వున్నట్లు తెలిసింది. ఆఖరికి గన్నవరం ఎమ్మెల్యే టిక్కెట్‌ను కూడా దక్కించుకోవడంతో వల్లభనేని వంశీ ఊపిరిపీల్చుకున్నారు.