Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిక్కర్ స్కామ్ : వెలుగు చూస్తున్న నోట్ల కట్టల వీడియోలు

Advertiesment
cash bundles

ఠాగూర్

, ఆదివారం, 3 ఆగస్టు 2025 (14:50 IST)
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం స్కామ్‌ కేసు దర్యాప్తులో భాగంగా, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో కీలక పురోగతి సాధించింది. వైకాపా సీనియర్ నేత, తితిదే మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా భావిస్తున్న వెంకటేష్ నాయుడు స్వయంగా కోట్లాది రూపాయల నోట్ల కట్టలను లెక్కిస్తున్న వీడియోను సిట్ అధికారులు సంపాదించారు. ఎన్నికలకు ముందు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన ఈ డబ్బు మద్యం స్కామ్‌కు సంబంధించి ముడుపులుగా సీబీఐ అధికారులు బలంగా నమ్ముతున్నారు. 
 
సిట్ అధికారులు సేకరించిన ఈ వీడియోలో వెంకటేశ్ నాయుడు భారీ మొత్తంలో నగదును లెక్కిస్తూ, వాటిని బాక్సులలో సర్దుతున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ డబ్బును రహస్య ప్రదేశాలకు తరలించి, అక్కడి నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్న సిట్‌కు ఈ వీడియో ఒక బలమైన సాక్ష్యంగా లభించిందని అధికారులు పేర్కొంటున్నారు.
 
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ నగరంలోని ఓ రహస్య స్థావరంలో సిట్ అధికారులు రూ.11 కోట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఈ వీడియో బయటపడటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో దాదాపు రూ.3,500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగిందని సిట్ ప్రాథమికంగా అంచనా వేసి, ఇప్పటికే కోర్టుకు నివేదిక సమర్పించింది.
 
ఈ వీడియో ఆధారంతో కేసు దర్యాప్తును సిట్ మరింత వేగవంతం చేసింది. మరిన్ని రహస్య స్థావరాలు, డబ్బు నిల్వలపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఈ కీలక సాక్ష్యంతో కేసులో మరికొంత మంది ప్రమేయం బయటపడే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలితో భార్య చేతికి చిక్కిన భర్త ... ఎక్కడ?