శ్రీకాకుళం జిల్లా భోగాపురం మండలంలోని ఓ గ్రామ సర్పించి అక్రమ సంబంధాన్ని ఓ వ్యక్తి బహిర్గతం చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళతో విజయనగరంలోని ఒక లాడ్జిలో ఉండగా ఆమె భర్త వీరిద్దరినీ పట్టుకొని ఒకటో పట్టణ పోలీసులకు శనివారం అప్పగించాడు. సదరు సర్పంచిని భర్త తరపు బంధువులు దేహశుద్ధి చేశారు.
సర్పంచి గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకుడిగా కీలక పాత్ర పోషించి చివరి సమయంలో జనసేనలో చేరాడు. ఓ మాజీ మంత్రి సోదరుడికి ప్రధాన అనుచరుడిగా తిరిగేవాడు. భోగాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు డెంకాడ మండలానికి చెందిన వ్యక్తితో 16 ఏళ్ల కిందట ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. సదరు మహిళను సర్పంచి మళ్లీ వివాహం చేసుకున్నట్లు సమాచారం.
ఎవరు ఎవరితోనైనా తిరగొచ్చని, చట్టంలో అలాగే ఉందని.. కేసు పెట్టలేమని పోలీసులు పంపించేశారని సంబంధిత మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ఒకటో పట్టణ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరిని వివరణ కోరగా.. విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఇరువర్గాలకు కౌన్సెలింగ్ చేసి పంపించేశామన్నారు. కేసు నమోదు కాలేదని పేర్కొన్నారు.