Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎల్ఐసీ నుంచి బుట్టా రేణుక రూ.360 కోట్ల రుణం.. ఆస్తులు వేలం

Advertiesment
LIC Housing auctioning properties of YCP candidate Butta Renuka

సెల్వి

, శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (10:07 IST)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న బుట్టా రేణుక ఎల్‌ఐసీ హౌసింగ్‌ సంస్థ నుంచి దాదాపు రూ.360 కోట్ల రుణం తీసుకొని బురిటీ కొట్టేశారు. దీంతో అప్పు కోసం బుట్టా రేణుక దంపతులు తనఖా పెట్టిన ఆస్తులను వచ్చేనెల 6న వేలం వేస్తామంటూ సంస్థ ప్రకటించింది. 
 
దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించనందునే ఆస్తులు వేలం వేస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. బుట్టా రేణుక కుటుంబ సభ్యులకు హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులతో పోల్చితే ఈ అప్పు ఓ లెక్కలోకి కూడా రాదు. రెండుమూడు ఆస్తులు విక్రయించినా... మొత్తం అప్పు తీరిపోతుంది. బుట్టా దంపతులు దాదాపు రూ.360 కోట్లను రెండు రుణ ఖాతాల ద్వారా తీసుకున్నారు. 
 
ఈ రుణానికి 2019 నవంబరు 18న బుట్టా రేణుక, బీఎస్‌ నీలకంఠకు డిమాండ్‌ నోటీసు పంపింది. ఈ ఆస్తుల రిజర్వు ధరను రూ.360 కోట్లుగా ఎల్‌ఐసీ హౌసింగ్‌ పేర్కొంది. ఈ ఆస్తులన్నింటినీ ఏకమొత్తంలో ఈ-వేలం ద్వారా విక్రయిస్తామని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షర్మిల బస్సుయాత్ర.. బద్వేల్ నుంచి ప్రారంభం