Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాలంటీర్ల పోస్టులకి రాజీనామా చేసిన 850 మంది, వీరి అసలు రూపం ఇదేనంటున్న తెదేపా

ap volunteers

ఐవీఆర్

, బుధవారం, 3 ఏప్రియల్ 2024 (15:51 IST)
కృష్ణాజిల్లాకు చెందిన 850 మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసారు. వీరిలో ఎక్కువమంది మచిలీపట్నం నియోజకవర్గానికి చెందినవారుగా వున్నారు. వాలంటీర్లుగా తాము గత ఐదేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నానీ, ఎన్నికల సంఘం నిబంధనలతో తాము తమ పనిచేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. పెన్షనర్లకు డబ్బులు ఇచ్చేటపుడు వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారన్న ఫిర్యాదులతో వీరిని సీఈసి దూరంగా పెట్టింది. పెన్షన్లను అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. త్వరలో ఏర్పాట్లు చేస్తామని ఏపీ సీఎస్ తెలిపారు.
 
వాలంటీర్ల పోస్టులకు రాజీనామాలు చేసినవారు మాట్లాడుతూ... పేదల కోసం తాము గత ఐదేళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈసీ నిర్ణయంతో తాము ఏమీ చేయలేకపోతున్నామనీ, అందుకునే ఉద్యోగాలు మానేసి వైసిపి కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. వీరి నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ... వారి ముసుగు తొలగి అసలు రూపం బయటపడింది. వారంతా పార్టీవారే. వాలంటీర్లు కాదు. ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ఆ ముసుగులో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపాకు మరో గట్టి షాక్.. కిల్లి కృపారాణి రాజీనామా!