Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిటన్ దేశస్థుడికి విముక్తి... తిరుపతి నుంచి పయనం

బ్రిటన్ దేశస్థుడికి విముక్తి... తిరుపతి నుంచి పయనం
, గురువారం, 16 ఏప్రియల్ 2020 (21:25 IST)
యుకె ఎంబస్సీ నుండి తిరుగు ప్రయాణానికి అనుమతి రావడంతో గురువారం సాయంత్రం క్యారేంటైన్‌లో ఉన్న బ్రిటన్ దేశస్థుడు కల్లీ క్లైవ్ బ్రయాంట్ బయలు దేరుతూ ఆతిధ్యం మరువలేనిదని మరోసారి శ్రీవారి దర్శనానికి వచ్చి సహకారం అందించిన అధికారులు, సిబ్బందిని కలుస్తానని ఇక్కడున్నరోజులు నాకు మధుర క్షణాలని వ్యక్తం చేశాడు.

అక్టోబర్ 2019 నుండి భారత దేశ యాత్రకు వచ్చిన బ్రిటన్ దేశస్థుడు వృత్తి రీత్యా జియోగ్రఫీ ప్రొఫెసర్  కల్లీ క్లైవ్ బ్రయాంట్ ప్రముఖ యాత్రస్థలం తిరుమల శ్రీవారిని దర్షించుకుని కోవిడ్ లాక్ డౌన్ తో తిరుపతి లొనే ఉండిపోవలిసి వచ్చింది.

విదేశయుడు కావడంతో పోలీసులు క్వారేంటైన్ సెంటర్ తిరుచానూరు శ్రీపద్మావతి నిలయంకు పంపించారు. ఏప్రిల్ 24 నుండి ఇక్కడే వున్నారు. రెండుసార్లు కోవిడ్ టెస్ట్‌లలో నెగటివ్ వచ్చింది, 14 రోజులు అయినా బయట ఎలాంటి బస వసతి ప్రయాణము వంటి సౌకర్యాలు లేవు. యుకె ఎంబస్సీకి దరఖాస్తుతో పర్మిషన్ రావడం.

17న ఉదయం 7 గంటలకు డొమెస్టిక్ ఫ్లయిట్ హైదారాబాద్ నుండి అహ్మ‌దాబాద్  నుండి బ్రిటిష్ ఎయిర్ లైన్స్‌లో రాత్రి 7 గంటలకు బయలుదేరనున్నారు. నేటి సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్, అర్బన్ ఎస్.పి.ల అనుమతులతో క్యాబ్ లో డిసార్జి సమ్మరి అందించి పాంపించారు. అతని సంతోషానికి అవధులు లేవు. సేవలందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి స్వహస్తాలతో అబ్రిప్రాయం వ్రాసిన పేపర్ అందించారు.

సెంటర్ ఇన్ చార్జి తుడా సెక్రటరీ లక్ష్మీ డిశ్చార్జి స‌మ్మరి అందించారు, సెట్విన్ సిఇఓ మురళీకృష్ణ, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్లు విజయలక్ష్మి, శ్రీనివాస్, సిబ్బంది వున్నారు. ప్రతిరోజు తనకు ఫుడ్ అందించిన ప్రవల్లికకు అభివాదం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్: అహ్మదాబాద్ ఆస్పత్రిలో హిందూ-ముస్లింలకు కోవిడ్-19 వార్డు విభజన అంటూ...