Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కట్నంగా రూ.25లక్షలిచ్చారు.. 20తులాలిచ్చారు.. ఆపై ఐదు లక్షలిచ్చారు.. ఇంకా తెమ్మనేసరికి?

అదనపు కట్నం కోసం భర్త పెట్టే వేధింపులు భరించలేక ఇంక్‌పాడ్ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నానికి చెందిన సూరారప

Advertiesment
కట్నంగా రూ.25లక్షలిచ్చారు.. 20తులాలిచ్చారు.. ఆపై ఐదు లక్షలిచ్చారు.. ఇంకా తెమ్మనేసరికి?
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (09:27 IST)
అదనపు కట్నం కోసం భర్త పెట్టే వేధింపులు భరించలేక ఇంక్‌పాడ్ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నానికి చెందిన సూరారపు బ్రహ్మయ్య కూతురు భార్గవి(25)ని విశాఖపట్నానికి చెందిన ఉమ్మడిశెట్టి నరేంద్రకు ఇచ్చి మార్చి 20వ తేదీన వివాహం చేశారు. అప్పట్లో కట్నంగా రూ.25లక్షలు, 20తులాల బంగారు ఆభరణాలు, ఆదిభట్లలో ఓ ప్లాట్‌ ఇచ్చారు. 
 
పెళ్లయిన నెలకే నగరం వచ్చి రాజీవ్‌నగర్‌లో నివసిస్తున్నారు. నరేంద్ర మధురానగర్‌లోని వామన కన్సెల్టెన్సీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నాడు. కానీ అదనపు కట్నం కావాలని భార్య ఐదు నెలల పాటు నరేంద్ర వేధించాడు. 
 
భార్గవి ఈ విషయాన్ని ఎల్లాఎడ్డిగూడలో ఉంటున్న తండ్రి బ్రహ్మయ్యకు చెప్పింది. దాంతో ఐదు లక్షల రూపాయలను అదనంగా ఇచ్చాడు. ఆదివారం రాత్రి భార్యాభర్త లిద్దరూ గొడవపడ్డారు. దీంతో సోమవారం ఉదయం భర్త నరేంద్ర బయటకు వెళ్లగానే ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. తాను చనిపోతున్నట్టు బంధువులకు అంతకుముందు ఫోన్‌చేసి చెప్పింది. పక్కనే ఉంటున్న బంధువు వచ్చి తలుపు కొట్టగా తీయలేదు. 
 
చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు తెరిచి చూడగా భార్గవి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. మృతురాలి తండ్రి బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా గడ్డ మీద జిహాదీలు లేకుండా చేస్తాం: డొనాల్డ్ ట్రంప్