Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైకాపా రెడ్ల రాజీనామాల పర్వం... టీడీపీలో చేరికలు

ycp leaders

ఠాగూర్

, గురువారం, 11 జనవరి 2024 (15:12 IST)
ఏపీలో అధికార వైకాపా పార్టీకి సొంత పార్టీ నేతలు తేరుకోలేని షాకిస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగాల్సివుండటంతో అధికార వైకాపాకు చెందిన నేతలు... టీడీపీ - జనసేన పార్టీల్లో చేరేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన అనేక వైకాపా రెడ్లు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. వీరిలో ఇంజనీరింగ్ కాలేజీ అధినేతలు. కార్పొరేటర్ స్థాయి నేతలు ఉన్నారు. 
 
వీరంతా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో గురువారం చేశారు. కర్నూలు 17వ డివిజన్ కార్పొరేటర్ కైపా పద్మాలతారెడ్డి, కేవీ.సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ అధినేత సుబ్బారెడ్డి, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ అధినేత కైపా అశోక్ కుమార్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి లోకేష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జిల్లాలో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని లోకేష్ ఈ సందర్భంగా సూచించారు. 
 
టీడీపీతోనే కర్నూలు జిల్లా అభివృద్ధి సాధ్యమని, వైసీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాకు ఒనగూరింది ఏమీ లేదని పార్టీలో చేరిన సుబ్బారెడ్డి, పద్మాలతారెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి అన్నారు. కర్నూలుకు వచ్చిన పరిశ్రమలు ప్రభుత్వ వేధింపులతో పరారయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సీమ నుండి పార్టీ ఆఫీసులో నాయుడు వుంటే నాయుడి సమక్షంలో.. లోకేశ్ దొరికితే లోకేశ్ సమక్షంలో నిత్యం రావడం, కండువాలు కప్పుకోవడం జరుగుతోంది.
 
ఈ జోష్ పండుగలు చూడకుండా.. శత్రువు ఆర్తనాదాలు వినకుండా.. కండువా కూడా కప్పుకోకుండా నానీ కలవడం.. దాన్నో సీరియల్ లెక్కన చెయ్యడానికి నాలుగో నానికి గొట్టం పెట్టడం , ఆయన మొరగడం, ఆ విషయమే బావిలో కప్పల లెక్క బెకబెక మని రచ్చ చేసుకోవడానికి సరిపోతోంది. నదీ పుష్కరాల దగ్గర కప్ప లెక్క నాలా బెకబెకలాడవచ్చు కదా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా మిలటరీ బే స్పైలో ఫ్లయింగ్ సాసర్