తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు గత 14 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనను విరమించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ఒక్కటీ ఫలించలేదు. పైగా, తమ డిమాండ్లను పరిష్కారమయ్యేంత వరకు ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని భీష్మించికూర్చొన్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం హిందూపురంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న శిబిరానికి స్థానిక ఎమ్మెల్యే, సినీ నటుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ వచ్చి తన సంఘీభావాన్ని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో పాల్గొని వారికి అండగా నిలిచారు.
ఈ సంర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, వైకాపా పాలనలో ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఉరవకొండలో జర్నిలిస్టులపై దాడి పైశాచికత్వానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. వైకాపా సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని ఆయన జోస్యం చెప్పారు.
బిల్కిన్ బానో అత్యాచారం కేసు : క్షమాభిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు
బిల్కిన్ బానో రేప్ కేసులో 11 మంది ముద్దాయిలకు గుజరాత్ కోర్టు ప్రసాదించిన క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ నిందితులందరూ రెండు వారాల్లో తిరిగి జైలుకు వెళ్ళాల్సిందేనంటూ సుప్రీకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం అధికారాలను గుజరాత్ సర్కారు లాగేసుకుంది కోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ నాగరత్న, ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. మొత్తం 11 మంది అత్యాచార నిందితుల రిలీజ్‌ను సవాల్ చేస్తూ బిల్కిన్ బానో వేసిన పిటిషన్‌కు అర్హత ఉందని సుప్రీంకోర్టు చెప్పింది.
రేప్ నిందితులకు క్షమాభిక్ష పెట్టే అర్హత గుజరాత్ ప్రభుత్వానికి లేదని, ఆ కేసులో అటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం మహారాష్ట్ర సర్కారుకు ఉందని, ఎందుకంటే అక్కడే ఆ కేసులో విచారణ జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో రేప్‌కు గురైంది. ఆ సమయంలోనే ఆమె కుటుంబాన్ని కూడా కోల్పోయింది. ఆ కేసులో శిక్షపడిన 11 మంది నిందితుల్ని 2022లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు.
క్షమాభిక్ష ద్వారా రిలీజైన వారిలో జవ్వంత్ నాయి, గోవింద్ నాయి, శైలేశ్ భట్, రాథేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేశరిభాయ్ వోహనియా, ప్రదీప్ మోర్దియా, బాకాభాయ్ వోహనియా, రాజుభాయ్ సోని, మిటేశ్ భట్, రమేశ్ చందన ఉన్నారు. జైలులో 14 ఏళ్లు శిక్ష అనుభవించిన తర్వాత రిలీజైనట్లు గుజరాత్ హోంశాఖ కార్యదర్శి రాజ్ కుమార్ గతంలో తెలిపారు. రిలీజైన తర్వాత ఆ 11 మందికి హీరోల తరహాలో వెల్కమ్ దక్కింది. అయితే రిలీజ్‌ను సవాల్ చేస్తూ బిల్కిస్ బానోతో పాటు మరికొంత మంది సుప్రీంను ఆశ్రయించారు.
సోమవారం విచారణ సమయంలో జస్టిస్ నాగరత్న.. గుజరాత్ ప్రభుత్వం వైఖరిని తప్పుపట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారాలను గుజరాత్ అపహరించినట్లు ఆమె తీర్పులో పేర్కొన్నారు. క్షమాభిక్షను ఇవ్వడం అంటే అధికారాలను గుజరాత్ సర్కార్ కిడ్నాప్ చేసినట్లే అని తెలిపారు. మహారాష్ట్ర అధికారాన్ని గుజరాత్ లాగేసుకున్నట్లు ఆమె తన తీర్పులో వివరించారు. అయితే గుజరాత్ సర్కార్ తన పరిధిలో ఉన్న అధికారాన్ని వాడుకున్నట్లు కోర్టు తెలిపింది. గుజరాత్ సర్కార్ ఇచ్చిన క్షమాభిక్షను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఈ తీర్పులో వెల్లడించింది.