Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాయసంలో నిద్రమాత్రలు కలిపి... ప్రియుడితో భర్తను చంపించిన భార్య...

పాయసంలో నిద్రమాత్రలు కలిపి... ప్రియుడితో భర్తను చంపించిన భార్య...
, ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (16:31 IST)
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ... కట్టుకున్న భర్తను ప్రియుడితో హత్య చేయించింది. పాయసంలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో మత్తులోకి జారుకున్న భర్తను తన ప్రియుడితో హత్య చేయించింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా పోలీసులతో పాటు సమాజాన్ని నమ్మించేందుకు ప్రయత్నించింది. కానీ, పోస్టుమార్టం నివేదిక మాత్రం ఈ హత్య కేసులోని నిందితులను పట్టించింది. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు పట్టణంలోని గిప్సన్‌ కాలనీకి చెందిన రామనాయుడు అనే వ్యక్తికి 17 యేళ్ల క్రితం నిర్మల అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, రామానాయుడు మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు ప్రారంభమయ్యాయి. 
 
ఇదిలావుంటే, పూటగడవడం కోసం రామానాయుడు భార్య నిర్మల ఆ ప్రాంతంలో ఉండే ఎస్ఎల్ఎన్ కేవీ ఫుడ్ ఫ్యాక్టరీలో స్వీపర్‌గా వెళ్లసాగింది. అక్కడ కిషోర్ బాబు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికిదారితీసింది. 
 
ఈ విషయం తెలుసుకున్న రామానాయుడు తరుచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో తన భర్తను ఎలాగైనా చంపేయాలని కిషోర్‌ను కోరింది. రామానాయుడును హత్య చేసేందుకు తన అల్లుడు, ధర్మపేటకు చెందిన విజయ్‌, స్నేహితుడు రాకేష్‌లతో కలిసి కిషోర్ ప్లాన్ వేశాడు. 
 
ఈ క్రమంలో మార్చి 22వ తేదీ అంటే జనతా కర్ఫ్యూ రోజున భర్త రామానాయుడుకి నిర్మల పాయాసం ఇచ్చింది. అందులో నిద్రమాత్రలు కలిపింది. పాయసం తిన్న రామానాయుడు నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఈవిషయాన్ని తన ప్రియుడు కిషోర్‌కు చేరవేసింది. రాత్రి 11 గంటల సమయంలో కిషోర్ తన స్నేహితులతో కలిసి ఆటోలో నిర్మల ఇంటికొచ్చి నిద్రలో ఉన్న రామానాయుడు గొంతును కాలితో తొక్కి చంపేసాడు.
 
ఆ తర్వాత మృతదేహాన్ని ఆటోలో నగర శివారు ప్రాంతానికి తీసుకెళ్లి... రోడ్డుపై పడేసి.. ఆటోతో తొక్కించారు. అంటే.. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించారు. మరుసటిరోజు నిర్మల తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు పోలీసులకు కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. 
 
ఈ పోస్టుమార్టం నివేదికలో రామానాయుడిని హత్య చేసినట్టు తేలింది. దీంతో పోలీసులు హత్య కేసుగా మార్చి... భార్య నిర్మలతో పాటు.. ఆమె మొబైల్ కాల్‌లిస్టుతో పాటు.. ఇతర ఆధారాలను సేకరించి అరెస్టు చేశారు. ఈ కేసులో నిర్మలతో పాటు.. కిషోర్ బాబు, విజయ్, రాకేష్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపాధి లేక కూరగాయలు విక్రయిస్తున్న మెజీషియన్.. ఎక్కడ?