Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కులం కాదనీ కడతేర్చాడు.. యువ వైద్యుడిని బండరాయితో మోది చంపేశారు..

కులం కాదనీ కడతేర్చాడు.. యువ వైద్యుడిని బండరాయితో మోది చంపేశారు..
, శుక్రవారం, 1 జనవరి 2021 (08:41 IST)
కర్నూలు జిల్లా ఆదోనీలో పరువు హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు బండతాయితో మోది ఓ యువ డాక్డరుని చంపేశారు. బండరాళ్ల దెబ్బలకు తాళలేక నడిరోడ్డుపై రక్తపు మడుగులో ప్రాణాలు వదిలేశాడు. 
 
కొత్త ఏడాదికి నూతనోత్సాహంతో స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న ప్రజలు, ఆటవిక సమాజపు ఆచారాలు ఇంకా కొనసాగడం చూసి నిశ్చేష్టులయ్యారు. విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఆ యువకుడిని, కాపు కాచిన కొందరు దుండగులు బైక్‌పై వెంటాడి కడతేర్చారు. ఈ దారుణం ఆదోని పట్టణంలోని విట్టా కిట్టప్ప నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని నందరవం మండలం గురుజాల గ్రామానికి చెందిన చిన్నలాజర్‌, సువార్తమ్మ అనే దంపతులకు నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉంది. వీరిలో బుడ్డన్న అలియాజ్‌ ఆడమ్‌ స్మిత్‌ (34) బాగా చదువుకుని  ఫిజియోథెరపిస్ట్‌గా పట్టా పొందాడు. 
 
అయితే, అదే గ్రామానికి చెందిన చిన్న ఈరన్న, లక్ష్మి దంపతుల కూతురు మహేశ్వరి డిగ్రీ వరకూ చదివింది. నంద్యాలలో బ్యాంకు ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటోంది. ఒకే ఊరికి చెందిన ఆడమ్‌ స్మిత్‌, మహేశ్వరి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం రెండు కుటుంబాల వారికీ తెలిసింది. దీంతో మహేశ్వరి తల్లిదండ్రులు గత ఏడాది నవంబరులో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. 
 
ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించిన ఈ జంట 2020 నవంబరు 11న నంద్యాల నుంచి హైదరాబాదుకు వెళ్లింది. మరుసటి రోజున ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం మహేశ్వరి కుటుంబ సభ్యులకు తెలిసింది. కూతురుని కులాంతర వివాహం చేసుకున్నాడని తెలిసి ఆడమ్‌పై కక్ష పెంచుకున్నారు. 
 
కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని నవ దంపతులు ఎస్పీ ఫక్కీరప్పను కలిసి రక్షణ కోరారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పోలీసులు రెండు కుటుంబాల వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా సరే, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని భావించిన ఇద్దరూ ఆదోని పట్టణంలోని విట్టా కిష్టప్ప నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 
 
ఆదోని పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో అడమ్‌ స్మిత్‌ విధులు నిర్వహించేవాడు. ఎప్పటిలాగే గురువారం విధులను ముగించుకుని, మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంటికి బయలుదేరాడు. దారిలో కాపుగాచిన కొందరు వ్యక్తులు ఆడమ్‌స్మిత్‌ను అడ్డగించి దాడి చేశారు. పరిగెడుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించినా వదలకుండా వెంటబడ్డారు. 
 
కొంత దూరం వెళ్లి కిందపడిపోయిన ఆడమ్‌ స్మిత్‌ తలపై బండరాయితో మోదారు. చుట్టుపక్క వారు అక్కడ గమనించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్నాడని భావించి 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Welcome2021 కొత్త సంవత్సరం.. ఆరోగ్యమే మహాభాగ్యం.. వీటిని ఆచరించండి..