Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తన భర్తను చంపితే పదిమందికి పడక సుఖం ఇస్తానంది....

సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. కట్టుకున్న భర్తను చంపించేందుకు తన శీలాన్నే ఎరగా వేసిందో భార్య. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో భర్తతో విభేదాలు ఉన్న భార్య

తన భర్తను చంపితే పదిమందికి పడక సుఖం ఇస్తానంది....
, శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (13:30 IST)
సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. కట్టుకున్న భర్తను చంపించేందుకు తన శీలాన్నే ఎరగా వేసిందో భార్య. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో భర్తతో విభేదాలు ఉన్న భార్యలు ప్రియుడితో కలిసి హత్య చేయడమో లేక సుపారీ ఇచ్చి హత్య చేయించడమో వంటి ఘటనలు చదివాం. కానీ ఈ భార్య మాత్రం తన శీలాన్నే పణంగా పెట్టి తన భర్తను చంపితే పడక సుఖం ఇచ్చేందుకు సిద్ధమని తెలిపింది. అది కూడా ఒకరు కాదు ఏకంగా పదిమందితో..
 
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం రామచంద్రాపురంకు చెందిన నారాయణస్వామి, ఉమాదేవిలకు 1995 సంవత్సరంలో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ముందు నుంచి ఉమాదేవిపై అనుమానంతో ఉన్నాడు నారాయణస్వామి. దీంతో తాగుడుకు బానిసయ్యాడు. ఉన్న ఆస్తి మొత్తాన్ని తాగుడుకు, మిగిలిన వాటిని ఖర్చు చేస్తూ వచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరుగుతూనే ఉండేది. దాంతోపాటు నారాయణస్వామికి ఎయిడ్స్ వచ్చిందన్న అనుమానం భార్యకు వచ్చింది. ఆ రోగం తనకు ఎక్కడ వస్తుందేమోనని భయపడింది. ఆస్తితో పాటు తన భర్తను వదిలించుకోవాలని పన్నాగం పన్నింది.
 
స్థానికంగా ఉన్న వన్నూరుస్వామి అనే వ్యక్తితో పరిచయం ఏర్పరచుకుంది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నిరోజుల తరువాత తన భర్తను చంపేయాలని వన్నూరు స్వామిని కోరింది. తన స్నేహితులు కొంతమంది ఉన్నారని వారితో మాట్లాడతానని చెప్పారు వన్నూరు స్వామి. తొమ్మిదిమంది స్నేహితులతో కలిసి ఒక కూర్చుంది ఉమాదేవి. తన భర్తను చంపేయాలని కోరింది. దీంతో వారందరూ కలిసి నీ భర్తను చంపితే మాకేమి ఇస్తామని బేరం పెట్టారు. 
 
లక్ష రూపాయలు బేరం మాట్లాడింది. కానీ వారందరూ దాంతో పాటు నువ్వు కావాలని కోరారు. దీంతో ఉమాదేవి ఒకే చెప్పింది. తన భర్తను చంపితే మీకు పడకసుఖం ఇచ్చేందుకు సిద్ధమని చెప్పింది. దీంతో ఈ నెల 9వ తేదీన రాములవారి గుడికి వెళ్ళిన నారాయణస్వామిని పథకం ప్రకారం దారుణంగా హత్య చేశారు.  
 
మొదట్లో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోస్టుమార్టంలో అసలు విషయం బయటపడటంతో భార్య ఉమాదేవిని పోలీసులు విచారిస్తే విషయం కాస్తా బయటపడింది. ఉమాదేవి నిందితులకు ఇచ్చిన ఆఫర్ చూసి ఆశ్చర్యపోయారు పోలీసులు. ఇలాంటి మహిళను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగుళూరులో కేసీఆర్... వెంట ప్రకాష్ రాజ్.. తెరాసలో చేరినట్టేనా?