Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తకు సలహాలిస్తూ కన్నబిడ్డను దగ్గరుండి మరీ రేప్ చేయించిన తల్లి!

సమాజంలో రోజురోజుకూ మనుషుల మధ్య మానవత్వం మంటగలిసి పోతోంది. తల్లీపిల్లల మధ్య కూడా మాతృత్వం అంతరించిపోతోందనడానికి ఉదాహరణే ఈ ఘటన. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన ఓ తల్లి హృదయం పాషాణంగా మారింది. కన్నతండ్రి కూతురిపై అత్యాచారా

భర్తకు సలహాలిస్తూ కన్నబిడ్డను దగ్గరుండి మరీ రేప్ చేయించిన తల్లి!
, శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:24 IST)
సమాజంలో రోజురోజుకూ మనుషుల మధ్య మానవత్వం మంటగలిసి పోతోంది. తల్లీపిల్లల మధ్య కూడా మాతృత్వం అంతరించిపోతోందనడానికి ఉదాహరణే ఈ ఘటన. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన ఓ తల్లి హృదయం పాషాణంగా మారింది. కన్నతండ్రి  కూతురిపై అత్యాచారానికి పాల్పడగా... అతడికి ఎలా సహకరించాలో చెబుతూ మాతృత్వానికి తీరని మచ్చ తెచ్చిందో తల్లి. కంటికి రెప్పలా కాపాడాల్సిన బిడ్డను ఐదేళ్ల ప్రాయం నుంచే నరకం చూపించడం మొదలుపెట్టారు ఆస్ట్రేలియాలోని ఓ తల్లిదండ్రులు. 
 
10-15 యేళ్లుగా తండ్రి ఆ బిడ్డను చిత్ర హింసలకు గురి చేస్తూ లైంగిక దాడికి పాల్పడగా అలాంటి చర్యను ఎదుర్కొవాల్సిన తల్లి అతడికి చేదోడువాదోడుగా నిలిచింది. వివరాల్లోకి వెళితే... ఆస్ట్రేలియాలో ఓ 59 ఏళ్ల వ్యక్తి, 51 ఏళ్ల మహిళ భార్య భర్తలు. ఈ దంపతులకి ఒక కూతురు ఉంది. ఆ కూతురుకి ఐదేళ్లు వచ్చాక తీసుకెళ్లి వారి ఇంటి ఎదురుగా ఉన్న షెడ్డులో కట్టేశారు. అనంతరం ఆమెపై లైంగికదాడికి పాల్పడుతూ వచ్చారు. దాదాపు పది హేనేళ్లపాటు ఆమెపై ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ క్రమంలో పదునైన ఆయుధాలతో బాలిక శరీరంపై గుచ్చుతూ నానాహింసలు పెట్టేవారు. మిరపకాయలు తినిపించేవారు. తాము చెప్పినట్లు చేయకుంటే చంపేస్తామంటూ... రంపపు బ్లేడుతో గాయాలు చేశారు. ప్రస్తుతం మానసిక వైద్యాలయంలో చికిత్స పొందుతున్న ఆ బాధిత యువతి 2011లో తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రెండేళ్లపాటు విచారణ చేసి 2013లో వారిని అరెస్టు చేయగా వారికి శుక్రవారం కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఆ తండ్రి 73 నేరాలకు పాల్పడగా ఆమె మొత్తం 13 నేరాలకు పాల్పడినట్లు కోర్టు నిర్దారించింది. ఎట్టకేలకు ఆ కసాయి తల్లిదండ్రులు ఊచలు లెక్కపెడుతున్నారు. అతడికి 48 ఏళ్ల జైలు శిక్ష విధించగా ఆమెకు 16 ఏళ్ల జైలు శిక్ష, 11 ఏళ్ల సామాజిక సేవను శిక్షగా విధించారు. వారు చేసిన చర్యలపట్ల సిడ్నీ కోర్టు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హరీష్‌రావత్ ఓవరాక్షన్: ఓ మహిళ కాళ్లుపట్టుకుని రోదిస్తుంటే.. వెకిలినవ్వు నవ్వారు