Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హరీష్‌రావత్ ఓవరాక్షన్: ఓ మహిళ కాళ్లుపట్టుకుని రోదిస్తుంటే.. వెకిలినవ్వు నవ్వారు

ఉత్తరాఖండ్ సీఎం హరీష్‌రావత్ ఓవరాక్షన్ చేశారు. సాక్షాత్తూ సీఎం హరీష్ రావత్ కాళ్ల మీదపడి ఓ మహిళ సమస్యను పరిష్కారించాలని రోదిస్తుంటే.. సీఎం మాత్రం నిర్లక్ష్యంగా వెకిలినవ్వు నవ్వుతూ కనిపించారు. దీనిపై ప్ర

హరీష్‌రావత్ ఓవరాక్షన్: ఓ మహిళ కాళ్లుపట్టుకుని రోదిస్తుంటే.. వెకిలినవ్వు నవ్వారు
, శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:14 IST)
ఉత్తరాఖండ్ సీఎం హరీష్‌రావత్ ఓవరాక్షన్ చేశారు. సాక్షాత్తూ సీఎం హరీష్ రావత్ కాళ్ల మీదపడి ఓ మహిళ సమస్యను పరిష్కారించాలని రోదిస్తుంటే.. సీఎం మాత్రం నిర్లక్ష్యంగా వెకిలినవ్వు నవ్వుతూ కనిపించారు. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల కష్టనష్టాల్ని ఓపిగ్గా వినాల్సిన సీఎం మహిళ అలా కాలిపై పడి ఏడుస్తుంటే.. ఏమాత్రం సీరియస్ కాకుండా నవ్వుతూ ఉండటం ఏమిటని వారు మండిపడుతున్నారు.
 
సదరు మహిళ ఎంతగా రోదించినా సీఎం వెకిలిగా నవ్వుతుండటం చూసి పక్కనున్న వారు షాక్ అయ్యారు. చివరికి మహిళా పోలీసులు అధికారులు వచ్చి సీఎం చేత బలవంతంగా హామీ ఇప్పించిన తర్వాతే ఆ మహిళ స్టేజ్ దిగి వెళ్లిందట. అంతవరకు సీఎం కాళ్ళు పట్టుకున్నా.. హరీష్ రావత్ మాత్రం సదరు మహిళ విజ్ఞప్తి చేసిన సమస్యను పరిష్కరించే అంశంపై ఎలాంటి హామీ ఇవ్వలేదని టాక్. ఇకపోతే.. ఈ సన్నివేశానికి సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ మహిళ తాగి తందనాలాడింది.. రెండు తగిలించి లాక్కెళ్ళిన పోలీసులు...