Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నూలు బస్సు ప్రమాదం.. అగ్నికీలల్లో కుటుంబ సభ్యులంతా సజీవదహనం

Advertiesment
ramesh family

ఠాగూర్

, శుక్రవారం, 24 అక్టోబరు 2025 (10:59 IST)
ఏపీలోని కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి మాత్రం ఇప్పటివరకు 11 మంది చనిపోయినట్టు అధికారికంగా ధృవీకరించారు. మృతుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి నలుగురు సభ్యులు ఉన్నారని తెలిపారు. ఈ వార్త ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. 
 
హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు శుక్రవారం వేకువజామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో సహా సజీవదహనమయ్యారు. ఉపాధి నిమిత్తం బెంగుళూరులో స్థిరపడిన రమేష్ కుటుంబం, హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుంటగా ఈ ఘోరం జరిగింది. కుటుంబం మొత్తం మృత్యువాతపడటంతో వారి స్వగ్రామంలో విషాదం నెలకొంది. 
 
కాగా, ఈ ప్రమాదంలో కొందరు స్థానికులు మానవత్వాన్ని చాటుకున్నారు. హిందూపూర్‌కు చెందిన నవీన్ అనే వ్యక్తి తన కారులు ఆరుగురు క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అదేవిధంగా పుట్టపర్తి నుంచి వస్తున్న హైమరెడ్డి అనే మహిళ బస్సులో మంటలు రవడానని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరినీ పార్టీ ఆఫీసుకు పిలవొద్దు.. అమరావతికి వచ్చాక వాళ్ల సంగతి తేలుస్తా... నేతలపై బాబు ఫైర్