Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమ్మినేని సీతారాం అసలైన రాజకీయ వ్యభిచారి.... కూన రవికుమార్

Advertiesment
Kuna Ravi Kumar
, బుధవారం, 27 నవంబరు 2019 (15:24 IST)
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై మాజీ విప్ కూన రవికుమార్ సంచలన కామెంట్స్ చేశారు. స్పీకర్ స్థానంపై గౌరవం ఉంది... ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నానని సభ్యసమాజం తలదించుకునేలా తమ్మినేని మాట్లాడితే ఉరుకోవాలా అని ప్రశ్నించారు. 
 
ముఖ్యంగా, తమ్మినేని సీతారాం అసలైన రాజకీయ వ్యభిచారి అంటూ మండిపడ్డారు. అబద్దాలకు, అవినీతికి పర్యాయపదం తమ్మినేని సీతారాం, స్పీకర్ భాష హుందాగా ఉండాలి, దేశంలో ఏ స్పీకర్ వాడని భాషని తమ్మినేని వాడుతున్నారంటూ ఆగ్రహించారు.
 
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీది ద్వంధ్వ పౌరసత్వం అని సీతారాం అనడం సిగ్గుచేటన్నారు. సమాజంలో స్పీకర్ బూతులు మాట్లాడవచ్చు అని ఏ రాజ్యాంగలో రాసి ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. సభ లోపల, బయట స్పీకర్ హుందాగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినీతి ఆదాయపన్ను శాఖ అధికారులపై వేటు