Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోదావరి, కృష్ణా బోర్డుల సమావేశం.. తెలంగాణ అధికారుల గైర్హాజరు

గోదావరి, కృష్ణా బోర్డుల సమావేశం.. తెలంగాణ అధికారుల గైర్హాజరు
, మంగళవారం, 3 ఆగస్టు 2021 (14:21 IST)
గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ సమావేశం అయింది. హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి బోర్డు, బోర్డు మెంబర్స్, ఏపీ ఈఎన్సీ, ట్రాక్స్ కో, జెన్ కో సీఎండీలు హాజరయ్యారు. 
 
అయితే ఈ భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. బోర్డు సమన్వయ కమిటీపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. బోర్డు స్థాయి సమావేశం జరపాలని తెలంగాణ డిమాండ్ చేసింది. పూర్తిస్థాయి సమావేశం జరిపితే తమ అభ్యంతరాలు చెబుతామని తెలంగాణ తెలిపింది. ఈ భేటీ ద్వారా కేంద్రం విడుదల చేసిన గెజిట్‌కు సంబంధించి రూట్ మ్యాప్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. 
 
ఎందుకంటే అక్టోబర్ 14 నుంచి గోదావరి, కృష్ణా యాజమాన్య బోర్డులకు సంబంధించి పూర్తిస్థాయి అధికారాలు బదలాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 14 నుంచి ఏపీకి, తెలంగాణకు గానీ ఎలాంటి అధికారులు ఉండవు. ప్రాజెక్టుల నిర్మాణం, నీటి విడుదల వంటి అన్ని విషయాలు బోర్డు పరిధిలోకి వెళ్తాయి
 
గోదావరి, కృష్ణా నదులకు సంబంధించి పరిధులపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ అధికారులందరూ హాజరయ్యారు. ఈ కమిటీలోని మొత్తం 12 సభ్యులు హాజరుకావాల్సివుండగా తెలంగాణకు సంబంధించిన ముగ్గురు మాత్రం భేటీకి హాజరు కాలేదు. 
 
మొదటి నుంచి తెలంగాణ ఈ భేటీకి ఆసక్తికనబరచడం లేదు. తూతూ మంత్రంగా జరిగే సమావేశం కాబట్టి పూర్తిస్థాయి భేటీ జరిగితే హాజరవుతామని, ప్రభుత్వ అభ్యంతారాలు చెబుతామని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కతువా జిల్లాలో కుప్పకూలిన భారత ఆర్మీ విమానం