ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులకు కోవిడ్ బీమా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులకు 50 లక్షల చొప్పున కోవిడ్ బీమా వర్తింపజేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
కార్మిక పరిషత్ సహా కార్మికుల వినతిపై స్పందించి ఆర్టీసీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇదే విషయంపై కార్మిక పరిషత్ నేతలు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబునుని కలసి మంగళవారం వినతి పత్రం అందించారు.
ఈ క్రమంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ఆర్టీసీ కార్మికులకు వర్తింప జేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఆర్టీసీలో కరోనాతో ఇప్పటి వరకు 36 మంది మరణించిన నేపథ్యంలో వారందరికీ బీమా వర్తింపజేసేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది.
మృతుల వివరాలు సహా తగిన డాక్యుమెంట్స్‌ను ఈ నెల 28లోగా పంపాలని అన్ని జిల్లాల రీజనల్ మేనేజర్స్‌కు ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు.