విజయవాడలోని భవానీపురం హెచ్.బి.కాలనీలో ప్రతిష్ఠాత్మకమైన శ్రీ కోదండ రామాలయం పునః నిర్మాణ ప్రతిష్ట పనులను దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ కోదండ రామాలయాన్ని ఆధునిక సాంకేతిక పద్ధతిలో జాకీలు ఉపయోగించి 4 అడుగులు పైకి లేపి, పునర్ నిర్మాణ కార్యక్రమాల్ని చేయనున్నారు. శ్రీరాముడు మనవాళికి అందించిన సందేశాన్ని, ఆయన ఆచరించి చూపిన జీవనశైలిని మనం అందిపుచ్చకొంటే, మన నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
తన పశ్చిమ నియోజకవర్గంలో హెచ్ బి కాలనీలో శివరామ భక్తమండలి అధ్వర్యంలో కొదండ రామాలయం పునః నిర్మాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో మంత్రి అతిధిగా పాల్గొన్నారు. భువనేశ్వరీపీఠం ఉత్తరాధికారి శ్రీ కమలానందభారతీ స్వామి సమక్షంలో ఆధునిక సాంకేతిక పద్ధతిలో శ్రీకొదండ రామాలయం పునః నిర్మాణ ప్రతిష్ట పనులను మంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా శ్రీకొదండ రామాలయమును ఆధునిక సాంకేతిక పద్ధతిలో జాకీలు ఉపయోగించి 4 అడుగులు పైకి లేపడం వంటి పలు అభివృద్ది కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
50 లక్షల రూపాయలతో సీజిఎఫ్ నిధులతో ముఖ మండప నిర్మాణ పనులు, దాతల సహకారంతో అన్నధాన భవనం, ఆలయ శిఖర నిర్మాణం, గోశాల పనులు జరుగుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వెలంపల్లి రఘ, రామరావు, ఆలయ నిర్వహకులు జింక చక్రధర్, సెక్రటరీ పూర్ణ సాంబశివరావు, సుబ్రమణ్యం, కార్పొరేటర్ పడిగిపాటి చైతన్య రెడ్డి పాల్గొన్నారు.