టిడిపినే బెటర్ - ముందు తమ్ముడు.. ఆ తరువాత అన్న...?
ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ పార్టీ ఈ పార్టీ కన్నా అధికారంలో ఉన్న పార్టీనే బెట్టర్ అని నిర్ణయం తీసుకున్నారట కిరణ్. టిడిపిలో చేరమని తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో ఇక చేసేది లేక
ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ పార్టీ ఈ పార్టీ కన్నా అధికారంలో ఉన్న పార్టీనే బెట్టర్ అని నిర్ణయం తీసుకున్నారట కిరణ్. టిడిపిలో చేరమని తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో ఇక చేసేది లేక కిరణ్ తెదేపా తీర్థం పుచ్చుకోవడానికి సిద్థమైపోయారట.
మొదటగా కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతారు. తమ్ముడు చేరిక తరువాత అన్న కిరణ్ కూడా తెదేపా తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు ఆయన వర్గీయులు. అయితే తెదేపాలో పదవులు అవసరం లేదని, కేవలం పార్టీ నేతగా ఉంటే చాలన్నది కిరణ్ ప్రస్తుత ఉద్దేశమట. అందుకే ఈ నిర్ణయానికి ఫైనలయ్యారట.
ఇప్పటికే కాంగ్రెస్, జనసేన ఇలా పార్టీల మీద పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుని చివరగా ఎపిలో అధికారంలో ఉన్న తెదేపానే మేలన్నది కిరణ్ ఆలోచన. అయితే చాలామంది ఆయన అనుచరులు కిరణ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారట. తెదేపా తప్ప ఇక ఏ పార్టీ అయినా సరే వెళదాం.. ఆ పార్టీ వద్దని చెబుతున్నారట. తమ్ముడి నిర్ణయాన్ని కాదని వేరే పార్టీలోకి వెళ్ళడం కిరణ్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది.