Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలితను శశికళే విషమిచ్చి చంపేశారు : కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం వెనుక కుట్ర దాగుందని తమిళనాడు తెలుగుయువశక్తి నేత కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు. అమ్మకు ఆమె స్నేహితురాలు శశికళ స్లో పాయిజన్‌ ఇచ్చి హతమార్చారని ఆరోపించారు.

Advertiesment
kethireddy jagadishwar reddy
, మంగళవారం, 20 డిశెంబరు 2016 (12:21 IST)
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం వెనుక కుట్ర దాగుందని తమిళనాడు తెలుగుయువశక్తి నేత కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు. అమ్మకు ఆమె స్నేహితురాలు శశికళ స్లో పాయిజన్‌ ఇచ్చి హతమార్చారని ఆరోపించారు. జయలలిత మృతిపై వెంటనే సిబిఐ విచారణ జరిపించి నిజానిజాలను నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశారు. గతంలో కూడా అన్నంలో విషం పెట్టి జయలలితను చంపేందుకు శశికళ, ఆమె భర్త నటరాజన్‌ ప్రయత్నించారని, విషయం కనిపెట్టిన జయలలిత వారిని ఇంటి నుంచి, పార్టీ నుంచే బయటకు పంపేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం కూడా శశికళ అదేవిధంగా చేశారని, ఆమే జయలలితను చంపేశారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. జయలలిత మరణించిన తర్వాత వెంట వెంటనే అంత్యక్రియలు చేయడంపై అనుమానం వ్యక్తంచేశారు. శశికళ ప్లాన్‌లో భాగమే ఇదంతా జరిగిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.
 
ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించానని, సుప్రీంకోర్టు తన పిటిషన్‌ను కూడా స్వీకరించిందని, వెంటనే జయలలిత మృతి వెనుక ఉన్న నిజానిజాలను బయటపెట్టాలని బయటకు తీయాలన్నారు. అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయాలని కోరారు. ప్రముఖ సినీనటి గౌతమి ఇదే విషయంపై స్పందిస్తే అనవసర రాద్ధాంతం చేశారని చెప్పారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద స్వామివారిని ప్రార్థిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి శ్రీవారి హుండీలో వేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెత్త వేశారో తాటతీస్తాం.. రూ.10వేలు జరిమానా కట్టాల్సిందే..