చెత్త వేశారో తాటతీస్తాం.. రూ.10వేలు జరిమానా కట్టాల్సిందే..
హైదరాబాద్ మహా నగర కార్పోరేషన్ చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. జీహెచ్ఎంసీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి చెత్త సమస్య. బహిరంగంగా చెత్త వేయటాన్ని నిషేధించాలని ఇప్పటివరకు గ్రే
హైదరాబాద్ మహా నగర కార్పోరేషన్ చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. జీహెచ్ఎంసీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి చెత్త సమస్య. బహిరంగంగా చెత్త వేయటాన్ని నిషేధించాలని ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన సందర్భంలో ఒక సరికొత్త వ్యూహాన్ని అమలు చేసి బహిరంగ చెత్తను నిర్మూలించాలని గ్రేటర్ కార్పోరేషన్ సంకల్పించింది. దీనిలో భాగంగానే ఒక పై గ్రేటర్ పరిధిలో ఎవరైనా బహిరంగంగా చెత్త వేస్తే వారికి పది వేల రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించింది.
చెత్తాచెదారం విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తే ప్రజారోగ్యానికి ఎటువంటి హానీ ఉండదని జీహెచ్ఎంసీ తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు, కూరగాయల మార్కెట్లు, వధశాలలు నిబంధనల మేరకు చెత్తాచెదారాన్ని తొలగించుకోవాలని పేర్కొంది. తడి, పొడి చెత్తను ఎప్పటికప్పుడు వేరుచేసి తరలించాలని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడేస్తే రూ.10వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.