Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్నారి వేర్లు అమ్ముకునే వృద్ధుడికి వివాహేతర సంబంధం.. ప్రాణం పోయింది..

నన్నారి వేర్లు అమ్ముకునే వృద్ధుడు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అతనితో సహజీవనం చేసే మహిళే ఆ వృద్ధుడి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీస

Advertiesment
నన్నారి వేర్లు అమ్ముకునే వృద్ధుడికి వివాహేతర సంబంధం.. ప్రాణం పోయింది..
, సోమవారం, 6 ఆగస్టు 2018 (12:10 IST)
నన్నారి వేర్లు అమ్ముకునే వృద్ధుడు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అతనితో సహజీవనం చేసే మహిళే ఆ వృద్ధుడి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి మండలం ముసలివేడుకు చెందిన మునిలక్ష్మీ అలియాస్‌ ధనలక్ష్మీ, నారాయణవనం మండలం కన్యకాపురానికి చెందిన టి.బాలాజి అలియాస్‌ బాలకృష్ణ సహజీవనం సాగిస్తున్నారు. 
 
వీరు నన్నారి వేర్లు అమ్ముకుంటూ సంచార జీవనం చేసేవారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా తనకల్లు మండలం సున్నంపల్లి దగ్గర తాత్కాలికంగా కాపురం ఉంటున్నారు. మునిలక్ష్మీకి సున్నంపల్లికి చెందిన జెరిపిటి నారాయణప్ప (70)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
సహజీవనం చేస్తున్న బాలాజీకి ఈ విషయం తెలియరావడంతో నారాయణప్పను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. నెల రోజుల కిందట మునిలక్ష్మీతో కలిసి నారాయణప్పను హత్య చేశారు. అలంపూర్‌ అటవీ ప్రాంతంలో అస్తి పంజరం పడి ఉందని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కదిరి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ అస్థిపంజరం నారాయణప్పదని విచారణలో తేలింది. ఇతని హత్యకు ధనలక్ష్మి కారణమని వెల్లడి అయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.5 వేల కోట్లు దోచుకున్న బ్యాంకులు... ఎలా?