Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాదంబరి కేసు.. చంద్రబాబు కాలనీ స్పా కేంద్రంలో సోదాలు.. వీడియో

kadambari jaitwani

సెల్వి

, సోమవారం, 30 సెప్టెంబరు 2024 (12:48 IST)
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కాదంబరీ జెత్వానీ, ఆమె తల్లిదండ్రుల పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో ఆమె ఫోన్లను తెరిపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జెత్వానీ ఐఫోన్లను తెరిపించేందుకు ఆమె సన్నిహితుడిపై మరో తప్పుడు కేసు పెట్టినట్లుగా తెలిసింది.
 
బెజవాడలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న ఒక స్పా కేంద్రంలో సోదాలు చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందంటూ మణిపూర్‌కు చెందిన కొందరు యువతులపై కేసు నమోదు చేశారు. అందులో స్పా సెంటర్‌ నిర్వాహకురాలు తమాంగ్ ‌(మణిపూర్‌‌కి చెందిన యువతి)ను ఏ 1గా చేర్చారు. విటుడిగా పేర్కొంటూ ఏ 2గా అమిత్‌ సింగ్‌ను ఇరికించారు. అతను ఢిల్లీ నుంచి ఇక్కడకు మహిళలను సరఫరా చేస్తున్నారని అభియోగాలు నమోదు చేశారు. 
 
ఈ తప్పుడు కేసును అడ్డుపెట్టుకుని అమిత్‌ను అరెస్టు చేసేందుకు ఆఘమేఘాలపై నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. కానీ అది జరగలేదు. ఢిల్లీ వెళ్లి ఉట్టి చేతులతోనే తిరిగి రావాల్సి వచ్చింది. ఈ స్పా వ్యవహారంపై ఇప్పటికే పటమట స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

NH931లో డిస్‌ప్లేయింగ్ బోర్డుకు వేలాడుతూ స్టంట్స్.. అంతా రీల్స్ పిచ్చి (వీడియో)