Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచంలోనే అత్యంత ప్రమాణాలతో కూడిన న్యాయ వ్యవస్థ మ‌న‌ది....

Advertiesment
justice mishra
విజ‌య‌వాడ‌ , బుధవారం, 26 జనవరి 2022 (18:25 IST)
ప్రజలకు వేగవంతంగా న్యాయాన్ని అందించేందుకు కృషి చేయడం జరుగుతోందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. బుధవారం నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని పోలీసుల గౌరవ వందనాన్నిస్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. 

 
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ పి.కె.మిశ్రా మాట్లాడుతూ, కరోనా పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రజలకు సత్వర న్యాయసేవలు అందించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, మహిళలు, చిన్నారులు వంటి వారికి న్యాయసేవలు అందించడం ప్రాధాన్యతగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని జస్టిస్ పికె మిశ్రా అన్నారు.
 
 
ప్రపంచంలోనే అత్యంత ప్రమాణాలతో కూడిన న్యాయ వ్యవస్థ మనదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.సామాన్యునికి న్యాయ సేవలను సకాలంలో అందించేందుకు వీలుగా న్యాయస్థానాలు విశేష చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.గత రెండేళ్ళుగా కరోనా పరిస్థితులు తలెత్తినా హైబ్రిడ్,వర్చువల్ విధానాలు ద్వారా ప్రజలకు న్యాయసేవలు అందించేందుకు అన్ని విధాలా కృషి జరుగుతోందని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ చేసి పౌరులకు అందించడమే గాక ప్రపంచ దేశాలకు అందించడంలో కూడా మన దేశం ప్రపంచానికే న్యాయకత్వం(గ్లోబల్ లీడర్ షిప్పు)వహిస్తోందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చెప్పారు.
 
 
ఈకార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ మాట్లాడుతూ మన రాజ్యాంగం పౌరులందరికీ సమాన అవకాశాలను కల్పించిందని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.రాజ్యాంగ స్పూర్తిని ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రతి పౌరుడూ తనవంతు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె.జానకిరామిరెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని పేర్కొన్నారు.అంతేగాక ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగం మనదని తెలిపారు.
 
 
హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ మన స్వాతంత్ర్య సమరయోదుల త్యాగాలను,రాజ్యాంగ రచనకు కృషి చేసిన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ సహా ఇతర ప్రముఖుల సేవలను గుర్తు చేసుకోవాల్సిన తరుణమిదని పేర్కొన్నారు. ఇంకా ఈ వేడుకల్లో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, రిజిష్ట్రార్లు, ఇతర న్యాయాధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలి : మంత్రి కేటీఆర్