సెన్సేషనల్ కాదు వంకాయ కాదు... బాబు గురించి ఉన్నదే చెప్పా... జేసీ దివాకర్ రెడ్డి
చంద్రబాబు నాయుడు మహాత్ముడు కాదని మళ్లీమళ్లీ గట్టిగా చెపుతున్నా... నేను చెప్పిన ఈ మాట సెన్సేషనల్ కాదు వంకాయ కాదు అని తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కువగా అధికారులతోనే కాలం గడుపుతున్నారనీ, కనీసం ఆయన కుటుంబంతో కూడా గడపడం లే
చంద్రబాబు నాయుడు మహాత్ముడు కాదని మళ్లీమళ్లీ గట్టిగా చెపుతున్నా... నేను చెప్పిన ఈ మాట సెన్సేషనల్ కాదు వంకాయ కాదు అని తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కువగా అధికారులతోనే కాలం గడుపుతున్నారనీ, కనీసం ఆయన కుటుంబంతో కూడా గడపడం లేదని అన్నారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జేసీ... రాష్ట్ర విభజనకు కారకులు రెడ్లే కారణమన్నారు. అందుకే ఈరోజు వాళ్లందరినీ తెలంగాణ వెళ్లి మరీ తిట్టి వచ్చానన్నారు.
చంద్రబాబు నాయుడు మహాత్ముడు కాదనీ, ఎన్టీఆర్ స్టామినా వేరని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఏదో 3 శాతం ఓట్లను చంద్రబాబు నాయుడు సాధిస్తే తమలాంటి వారమంతా కలిసి మరో 2 శాతం ఓట్లను లాక్కొచ్చి తెదేపాను అధికారంలోకి తెచ్చామన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాల్సి ఉందన్నారు.