Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పట్టుబడుతున్న మన తెలుగోళ్లు... ఎవరీ రామ్మోహన్ రావు? 200 కేజీల బంగారం నిజమేనా?

అదేమి విచిత్రమో గానీ ఈమధ్య దక్షిణాదిలో వరసబెట్టి ఆదాయపన్ను శాఖకు పట్టుబడుతున్నవారు తెలుగువాళ్లు కావడం కాకతాళీయమో లేక గ్రహచారమో తెలియడంలేదు. నోట్ల రద్దు తర్వాత ఆదాయపు పన్ను శాఖ దృష్టిలోకి మన తెలుగువాళ్లు పడుతున్నారు... దొరికిపోతున్నారు. తాజాగా తమిళనాడ

పట్టుబడుతున్న మన తెలుగోళ్లు... ఎవరీ రామ్మోహన్ రావు? 200 కేజీల బంగారం నిజమేనా?
, బుధవారం, 21 డిశెంబరు 2016 (21:12 IST)
అదేమి విచిత్రమో గానీ ఈమధ్య దక్షిణాదిలో వరసబెట్టి ఆదాయపన్ను శాఖకు పట్టుబడుతున్నవారు తెలుగువాళ్లు కావడం కాకతాళీయమో లేక గ్రహచారమో తెలియడంలేదు. నోట్ల రద్దు తర్వాత ఆదాయపు పన్ను శాఖ దృష్టిలోకి మన తెలుగువాళ్లు పడుతున్నారు... దొరికిపోతున్నారు. తాజాగా తమిళనాడు ప్రభుత్వంలో అత్యంత కీలక పదవిలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహన్ రావు ఇళ్లపై ఐటీ దాడులు జరగడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
ఇకపోతే అసలీ రామ్మోహన్ రావు ఎవరు? అని ఒక్కసారి పరిశీలిస్తే... రామ్మోహన్ రావు పుట్టింది ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో. 1985 తమిళనాడు ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవారు. 1987లో అసిస్టెంట్ కలెక్టరుగా పనిచేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు గుజరాత్ రాష్ట్రంలో కూడా పనిచేశారు. ఇంకా ఆయన వివిధ విభాగాల్లో పనిచేశారు. 
 
వ్యవసాయం, హౌసింగ్ మరియు అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ తదితర విభాగాల్లో పనిచేశారు. 2011లో ఆయనను ముఖ్యమంత్రి జయలలిత ప్రైవేట్ సెక్రటరీగా నియమించారు. ఆ తర్వాత జూన్ నెలలో ఆశ్చర్యకరంగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు జయలలిత. రామ్మోహన్ రావుకు తమిళనాడు బడా వ్యాపారులతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నట్లు చెపుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు అండ్ కో వద్ద 200 కేజీల బంగారం, రూ.100 కోట్లు