Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ అసలైన రెడ్డి కాదు.. నేనే అసలు సిసలైన రెడ్డిని: జేసీ దివాకర్ రెడ్డి

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అసలైన రెడ్డి కాదని.. తానే అసలు సిసలైన రెడ్డినని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. సీమకు నీరు ఇస్తే తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని జేసీ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి

Advertiesment
జగన్ అసలైన రెడ్డి కాదు.. నేనే అసలు సిసలైన రెడ్డిని: జేసీ దివాకర్ రెడ్డి
, శుక్రవారం, 13 జనవరి 2017 (18:33 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అసలైన రెడ్డి కాదని.. తానే అసలు సిసలైన రెడ్డినని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. సీమకు నీరు ఇస్తే తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని జేసీ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పట్టిసీమకు అడ్డుపడటం సరికాదన్నారు.
 
కాగా కలిదిండి మండలం తాడినాడలో కోడి పందాల్లో ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, మాగంటిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌పై విమర్శలు గుప్పించారు. జేసీ స్వయంగా కోడి పందాలకు రావడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. దివాకర్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన ఫ్యాన్స్ ‘రామలసీమ పులిబిడ్డ’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
 
అయితే అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డ్రగ్స్ వాడి సభలకు హాజరవుతున్నట్లుగా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించి పులివెందుల బ్రాంచి కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జేసీ దివాకర్ రెడ్డి.. శ్రీకాంత్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
 
ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు. మీ ఇంటికొస్తా, మీ నట్టింటికి వస్తా అని సినిమా డైలాగులు చెబుతున్నారన్నారు. ఇలాంటి భాషను రౌడీలు వాడుతారని మండిపడ్డారు. ఫ్యాక్షనిజంను రూపుమాపిన వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించడం విడ్డూరమన్నారు. తాము సంస్కారం లేని భాషను ఉపయోగించమన్నారు. జేసీ దివాకర్ రెడ్డి కాదని, జానావాకర్ రెడ్డి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముద్దుల సుమిత్ దొరికిపోయాడు.. అమ్మాయిలతో మాట్లాడుతూ.. ఒక్కసారి కిస్సిచ్చి పారిపోతాడు..