Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలా చేస్తే మరో 50 యేళ్ల సమయం పడుతుంది : జేపీ

అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న తరహాలో నిధులు ఇస్తే మరో 50 యేళ్ళ వరకు రాజధాని నిర్మాణం పూర్తికాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు.

Advertiesment
అలా చేస్తే మరో 50 యేళ్ల సమయం పడుతుంది : జేపీ
, శనివారం, 3 మార్చి 2018 (21:46 IST)
అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న తరహాలో నిధులు ఇస్తే మరో 50 యేళ్ళ వరకు రాజధాని నిర్మాణం పూర్తికాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ, రాజధాని గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ అని.. అక్కడి మౌలిక సదుపాయాలు, రహదారులు ఇలా అన్నింటికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఇలాగే ఆలస్యం చేసుకుంటూ పోతే రాజధాని నిర్మాణానికి మరో 50 ఏళ్ల  సమయం పడుతుందన్నారు. 
 
ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వాళ్లు తనదైనశైలిలో పోరాటాలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఫిబ్రవరి 16 కంటే.. ఇప్పటికి తనకు క్లారిటీ వచ్చిందన్నారు. అంతేగాకుండా కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. హక్కుల సాధనకు ప్రజాస్వామ్య పద్ధతిలో సంఘటితంగా కృషి చేయాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ - చంద్రబాబు ప్లాన్... తెరపైకి తృతీయ ఫ్రంట్...?