జేపీ కోసం జనసేనాని : కదనరంగంలోకి దూకిన పవన్ కళ్యాణ్
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం ఒక సంయుక్త కార్యారణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేయదలచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 24 గంటలు తిరగకముందే కథనరంగంలోకి దూకారు.
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం ఒక సంయుక్త కార్యారణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేయదలచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 24 గంటలు తిరగకముందే కదనరంగంలోకి దూకారు. ఇందులోభాగంగా, ఆయన గురువారం లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్‌తో భేటీ అయ్యారు. జేపీతో మూడు గంటలకు పవన్ భేటీ కావాల్సి ఉండగా, 2 గంటల 55 నిమిషాలకే జేపీ ఆఫీస్‌కు జనసేనాని చేరుకోవడం గమనార్హం.
కాగా, బుధవారం పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడుతూ, విభజన హామీలను నెరవేర్చడంతో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అలాగే, పలు అంశాలపై అధికార టీడీపీ నేతలు కూడా భిన్నరకాలుగా స్పందిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని కూడా పరోక్షంగా తప్పుబట్టారు.
అదేసమయంలో ఏపీ హక్కుల సాధన కోసం జేఏసీని ఏర్పాటు చేస్తానని, ఇందుకోసం తానే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. ఆ ప్రకారంగానే పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. ఇందులోభాగంగా, తొలుత లోక్‌సత్తా అధినేత జేపీతో సమావేశమయ్యారు. అలాగే, ఈనెల 11వ తేదీన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీకానున్నారు.