Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలా తీసిపారేయకండి.. వైఎస్సార్ అలాంటి మనిషి: లోక్‌సత్తా జేపీ

Advertiesment
Jaya Prakash Narayan
, గురువారం, 7 ఫిబ్రవరి 2019 (17:48 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డిపై లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ (జేపీ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ నాయకుడినీ తక్కువ అంచనా వేయవద్దన్నారు. నాడు చిన్న మార్పుతో ప్రజల మనసులను వైఎస్ రాజశేఖర రెడ్డి చూరగొన్నారనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో జేపీ గుర్తు చేశారు. 
 
సందర్భంగా, వ్యక్తిత్వాన్ని అనుసరిస్తే.. ప్రతి నాయకుడికి వారి పరిమితులు వారికి వుంటాయని.. అది ప్రధాని నరేంద్ర మోదీ అయినా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం చంద్రబాబు, ఏపీ సీఎం చంద్రబాబు లేదా వైకాపా చీఫ్ జగన్ అయినా అంతేనన్నారు. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దని చెప్పారు. 
 
నాయకుల గురించి తేలికగా మాట్లాడటం.. అనుచిత వ్యాఖ్యలు చేయడం.. తీసిపారేసేలా మాట్లాడటం.. మన దేశంలో అలవాటుగా మారిందని చెప్పారు. ఇదే తరహాలోనే ఇచ్చే తాయిలాలు వాళ్లకు అందాయి, వీళ్లకు అందలేదన్న గొడవ లేకుండా, అధికారులు, ఉద్యోగుల ప్రమేయం లేకుండా అందరికీ అందేలా చూశారని.. అలా ప్రజల మనస్సుల్లో బలమైన స్థానాన్ని వైఎస్సార్ సంపాదించుకున్నారని జేపీ వ్యాఖ్యలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడు - ప్రియుడు స్నేహితులతో కలిసిన భర్తను చంపేసిన భార్య