Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పుష్ప-2'కు కౌంట్‌‍డౌన్ : అల్లు అర్జున్‌ను టార్గెట్‌ను జనసేన నేతలు!!

Allu Arjun

ఠాగూర్

, గురువారం, 29 ఆగస్టు 2024 (10:32 IST)
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప-2' చిత్రం డిసెంబరులో విడుదలకానుంది. ఇందుకోసం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్‌ను జనసేన పార్టీ నేతలు టార్గెట్ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మిత్రుడు వైకాపా అభ్యర్థి శిల్పా రవి గెలుపునకు ప్రచారం చేశారు. అప్పటి నుంచి అర్జున్‌కు మెగా ఫ్యాన్స్‌కు టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీని కించపరిచేలా అల్లు అర్జున్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ రగిలిపోయారు.
 
జనసేన నేతలు మీడియా ముందుకు వచ్చి మరీ అల్లు అర్జున్‌పై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్ బాబు అల్లు అర్జున్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చలమలశెట్టి రమేశ్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్.. నీవు హీరో అనుకుంటున్నావా? కమెడియన్ మాత్రమే. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు. వారిని విమర్శించే స్థాయి నీకు లేదు అని రమేశ్ అన్నారు.
 
సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మహావృక్షం వంటివారని అన్నారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణతో సహా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించిన మహనీయుడు చిరంజీవి అని అన్నారు. నువ్వు (అర్జున్) నీడను ఇచ్చిన చెట్టునే విమర్శిస్తున్నావంటూ దుయ్యబట్టారు. నీ బాబు అల్లు అరవింద్. నువ్వు పిల్లికి కూడా బిచ్చం పెట్టలేనటువంటి వాళ్లు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ స్థాయి ఏమిటో.. నువ్వేమిటో ముందు చూసుకో అని హితవు పలికారు. నువ్వు తొందరలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదని అన్నారు. డిసెంబర్ నెలలో విడుదల అవుతున్న నీ సినిమా మా నియోజకవర్గంలో ఎలా అడుతుందో చూపిస్తానని శపథం చేశారు. ఇక్కడ నీ ఫ్లెక్సీలు కట్టే వాళ్లు కూడా ఎవరూ లేరని రమేశ్ బాబు అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్